Vande Bharat : ఎల్లుండి నుంచి విజయవాడ-చెన్నై వందే భారత్ -టైమింగ్స్, ఛార్జీలివే..
విజయవాడ -చెన్నై వందే భారత్ ప్రారంభం విజయవాడ - చెన్నై -విజయవాడ మధ్య నడిచే వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ రేపు (ఆదివారం) వర్చువల్ విధానంలో ఢిల్లీ నుంచి ప్రారంభించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులను కలుపుతున్న మొదటి వందే భారత్ రైలు ఇదే. రెగ్యులర్ రైలు సర్వీసులోని అన్ని తరగతులలో టికెట్ బుకింగ్ ప్రారంభమయ్యాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
అలాగే ఈ రైలు టైమింగ్స్ తో పాటు ఛార్జీలను కూడా ప్రకటించింది.
ఏపీ, తెలంగాణ రాజధానులైన విజయవాడ, చెన్నైలను కలుపుతూ సాగే ఈ వందే భారత్ రైలు ఈ రెండు రాష్ట్రాల మధ్య నడిచే తొలి రెగ్యులర్ ట్రైన్ కావడం విశేషం. ఈ స్వదేశీ సెమీ హైస్పీడ్ రైలు విజయవాడ రైల్వే స్టేషన్ నుండి ప్రారంభం కానుంది. అలాగే చెన్నై నగరంలోని పురట్చి తలైవర్ డా.ఎం.జి.రామచంద్రన్ సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో లింక్ చేశారు. మార్గ మధ్యంలో ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. విజయవాడ, చెన్నై మధ్య దూరాన్ని 6 గంటల 40 నిమిషాల్లో ఇది కవర్ చేయబోతోంది.

అలాగే విజయవాడ-చెన్నై వందే భారత్ రైలు.. రెండు రాష్ట్రాల యాత్రికులకు తిరుపతి ఆలయ పట్టణాన్ని సందర్శించడానికి అవకాశం కల్పిస్తుంది. విజయవాడ - చెన్నై- విజయవాడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రెగ్యులర్ రైలు సర్వీస్ సెప్టెంబర్ 25 నుంచి అంటే సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు 8 కోచ్‌లతో (7 AC చైర్ కార్ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్) కలిగి ఉంది. అలాగే ఇందులో 530 మంది ప్రయాణించేందుకు వీలుంది. ఈ రైలు మంగళవారం మినహా వారంలో 6 రోజులు ప్రయాణిస్తుంది.
చెన్నై సెంట్రల్ నుంచి ఉదయం 5.30కు బయలుదేరే 20677 నంబరు వందే భారత్ సర్వీస్ ఉదయం 7.05కు రేణిగుంట చేరుకుంటుంది. అక్కడి నుంచి 8.39కి నెల్లూరు చేరుకుంటుంది. 10.09కి ఒంగోలుకు, 11.21కి తెనాలి జంక్షన్ కు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12.10కి విజయవాడ జంక్షన్ కు వచ్చేస్తుంది. అలాగే విజయవాడ నుంచి చెన్నైకు బయలుదేరే వందేభారత్ 20678 సర్వీస్.. మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరుతుంది. తెనాలి జంక్షన్ కు 3.49కి వస్తుంది. అక్కడి నుంచి ఒంగోలుకు సాయంత్రం 5.03కు, నెల్లూరుకు 6.19కి, రేణిగుంటకు 8.05కి వస్తుంది. చివరిగా చెన్నైకు రాత్రి 10 గంటలకు చేరుకుంటుంది.
ఐ.ఆర్.సీ.టి.సీ. వెబ్‌సైట్ తో పాటు రిజర్వేషన్ కౌంటర్ల వద్ద టికెట్లు లభిస్తాయి. క్యాటరింగ్ ఛార్జీలు ఆప్షనల్ గా ఉంచారు. వీటిని టిక్కెట్‌లను బుక్ చేసేటప్పుడు ఎంచుకోవచ్చు. విజయవాడ నుండి చెన్నై సెంట్రల్‌కు క్యాటరింగ్ ఛార్జీతో సహా ఏ. సీ. చైర్ కార్ ఛార్జీ రూ. 1420 గా నిర్ణయించారు. ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ. 2630. చెన్నై సెంట్రల్ నుండి విజయవాడకు క్యాటరింగ్ ఛార్జీతో సహా ఏ.సీ చైర్ కార్ ఛార్జీ రూ.1320గానూ, ఎగ్జిక్యూటివ్ తరగతి ధర రూ.2540గానూ నిర్ణయించారు. విజయవాడ నుండి చెన్నై సెంట్రల్‌కు క్యాటరింగ్ ఛార్జీను మినహాయిస్తే ఏ.సీ.చైర్ కార్ ఛార్జీ రూ.1135గానూ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2280గానూ నిర్ణయించారు. చెన్నై సెంట్రల్ నుండి విజయవాడకు క్యాటరింగ్ ఛార్జీ లేకుండా ఏ.సీ.చైర్ కార్ ఛార్జీ రూ. 1135గానూ, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ధర రూ.2280గానూ నిర్ణయించారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications