విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైజాగ్ లో కేంద్ర పథకాలు వల్లెవేసిన మోడీ- ఏపీకిచ్చిన హామీలపై మౌనం- ఏం చెప్పారంటే ?

|
Google Oneindia TeluguNews

ప్రియమైన సోదరీ సోదరులారా నమస్కారం అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగం మొదలుపెట్టారు. సభికులకు అభివాదం చేశాక మోడీ తన ప్రసంగం ప్రారంభించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా ఏపీకి వచ్చి మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చిందని మోడీ తెలిపారు. దాదాపు అరగంటసేపు సాగిన ప్రధాని ప్రసంగంలో జాతీయ అంశాలు, ఆర్ధిక వ్యవస్ధ, అభివృద్ధి, కేంద్రపథకాలపైనే ప్రస్తావించారు. ఏపీకిచ్చిన హామీల ప్రస్తావన కానీ, కొత్తగా ఇచ్చిన హామీలు కానీ లేవు.

ప్రధాని మోడీ ప్రసంగం

ప్రధాని మోడీ ప్రసంగం

విశాఖ ఓప్రత్యేక నగరమని,వ్యాపార కేంద్రమైన నగరమని ప్రధాని మోడీ తన ప్రసంగంలో తెలిపారు. వేల ఏళ్ల క్రితమే విశాఖ పోర్టు నుంచి పశ్చిమాసియా నుంచి రోమ్ వరకూ వ్యాపారం సాగేదని, ఇవాళ కూడా విశాఖపట్నం భారత వ్యాపార కేంద్రబిందువుగా ఉందన్నారు. పదివేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులు ఏపీలోని విశాఖ ఆకాంక్షలు తీర్చేందుకు ఉపయోగిస్తున్నామన్నారు. మౌలిక సౌకర్యాల నుంచి ప్రారంభించి, ఈజ్ ఆఫ్ లివింగ్, ఆత్మ నిర్భర్ భారత్ వరకూ అభివృద్ధికి ఉపయోగపడతాయన్నారు. కాబట్టి వీటి వల్ల ఏపీ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.

ఏపీ ప్రజలపై మోడీ

ఏపీ ప్రజలపై మోడీ

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ ఎంపీ హరిబాబుకు కూడా ఈ సందర్భంగా మోడీ ధన్యవాదాలు చెప్పాలన్నారు. వారు తనను ఎప్పుడు కలిసినా ఏపీ గురించే మాట్లాడేవారని, ఏపీలో ప్రజలకు ఓ ప్రత్యేకత ఉందని తెలిపారు. ఇక్కడి వారు ఔత్సాహికులని,దేశంలో ఎక్కడికెళ్లినా ఏపీ ప్రజలు తమ ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తుంటారని మోడీ కొనియాడారు. అది విద్య అయినా, వ్యాపారం, సాంకేతిత, వైద్యరంగమైనా.. ఎక్కడైనా ఏపీ ప్రజలు తమ విశిష్టతను చాటుకుంటున్నారన్నారు. ఇది వాళ్ల వృత్తి నైపుణ్యం కంటే కూడా కలుపుగోలుతనం వల్లే జరుగుతోందన్నారు.

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై

మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై

ఆజాదీకా అమృత్ మహోత్సవ్ వేళ ఈ దేశం అభివృద్ది పథంలో దూసుకుపోతోందని మోడీ తెలిపారు. ఈ అభివృద్ధి యాత్ర బహుముఖమైనదని, ఇందులో సామాన్యుల వ్యధలు కూడా ఉన్నాయని, మౌలిక సదుపాయాల కల్పన కూడా ఉందని మోడీ తెలిపారు. ఇవాళ ఈ కార్యక్రమంలో మౌలిక సదుపాయాల రంగంలో మన దార్శనికత కనిపిస్తోందన్నారు. సమ్మేళిత అభివృద్ధి తమ ఆశయమని, మౌలిక సదుపాయాల కల్పనలో కేంద్రం వెనకాడటం లేదని తెలిపారు. అవి పోర్టులైనా, రోడ్లయినా సిద్ధమేనన్నారు. మౌలిక సౌకర్యాలు లేకపోతే దేశం పంపిణీ రంగంలో ముందడుగు వేయలేదని,సరఫరా గొలుసు బహుముఖ అనుసంధానంపై ఆధారపడి ఉంటుందన్నారు. లాజిస్టిక్స్ కావాలంటే మౌలిక సౌకర్యాల కల్పన తప్పనిసరని, ఓవైపు విశాఖపట్నం రైల్వేస్టేషన్ ను ఆధునీకీకరిస్తూనే, మరోవైపు ఫిషింగ్ హార్బర్ ను కూడా అభివృద్ది చేస్తున్నామన్నారు. పీఎం గతి శక్తి జాతీయ పథకం ద్వారా మౌలిక సదుపాయాల కల్పనే కాదు ఖర్చు కూడా తగ్గిందన్నారు.

ఏపీ కల నెరవేరుస్తున్నాం..

ఏపీ కల నెరవేరుస్తున్నాం..


ఇవాళ ప్రారంభిస్తున్న కార్యక్రమాల కోసం ఏపీ ఎన్నాళ్లుగానో ఎదురుచూసిందని ప్రధాని మోడీ తెలిపారు. ఏపీ తీరప్రాంతం అభివృద్ది కోసం ఉరకలేస్తోందన్నారు. ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, కొన్ని దేశాలకు నిత్యావసరాలు కూడా అందడంలేదన్నారు. మరికొన్ని దేశాలు ఇంధన సంక్షోభం ఎదుర్కొంటున్నాయని, ఆర్దిక సంక్షోభం అన్ని దేశాల్లోనూ ఉందన్నారు. కానీ భారత్ మాత్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్నారు. అందుకే ప్రపంచమంతా ఏపీవైపు చూస్తోందన్నారు. దేశంలో మేథావులంతా దీన్ని ప్రశంసిస్తున్నారని మోడీ తెలిపారు. సామాన్యుడి జీవితాన్ని సుఖమయం చేసేందుకే తాము ఇదంతా చేస్తున్నామన్నారు.

పేదల కోసమే ఇదంతా అన్న మోడీ

పేదల కోసమే ఇదంతా అన్న మోడీ

పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నామని ప్రధాని మోడీ తెలిపారు. ఈ అభివృద్ధి యాత్రలో మారుమూలప్రాంతాలు కూడా భాగస్వాములవుతున్నాయన్నారు. వెనుకబడిన జిల్లాల్లోనూ ప్రత్యేక పథకాలు అమలవుతున్నాయని, దేశంలో కోట్లాది మంది పేదలకు మూడున్నరేళ్లుగా ఉచితంగా రేషన్ అందుతోందని ప్రధాని మోడీ తెలిపారు. పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు లబ్ది కలుగుతోందన్నారు సన్ రైజ్ సెక్టార్ ఆలోచన కారణంగా గేమింగ్ నుంచి అంతరిక్షంవరకూ అన్ని రంగాల్లో యువతకు అవకాశాలు లభిస్తున్నాయని మోడీ తెలిపారు . ఏపీలో ఆధునిక పరిజ్ఞానం కారణంగా డీప్ వాటర్ లో ఇంధనం వెలికి తీయగలుగుతున్నామన్నారు. బ్లూ ఎకానమీ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు మోడీ తెలిపారు.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునీకీకరణ ద్వారా మత్సకారుల పని సులువవుతుందన్నారు. పేదలు శక్తిమంతులై ఆధునిక సదుపాయాలు వారికి చేరతాయో భారత్ కల నెరవేరుతుందన్నారు. సముద్రం పూర్వకాలం నుంచి ప్రజల సమృద్ధిలో ఉపయోగపడుతుందన్నారు. ఇవాళ వేల కోట్ల ప్రాజెక్టులు నడుస్తున్నాయని, భవిష్యత్తులో ఇవి మరింత విస్తరిస్తాయన్నారు ఏపీ దేశ అభివృద్దిలో భాగస్వామి అవుతుందని ఆశిస్తున్నట్లు మోడీ తెలిపారు.

English summary
pm modi on today made key comments in his address in vizag public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X