PM Modi Tour: శ్రీశైలంలో మోడీ..! చంద్రబాబు, పవన్ తో కలిసి దర్శనం..!

ఏపీలో ప్రధాని మోడీ పర్యటన ఉత్సాహంగా కొనసాగుతోంది. ఇవాళ ఉదయం శ్రీశైలం చేరుకున్న ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో పాటు పలువురు నేతలు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. జీఎస్టీ 2.0 సంస్కరణలపై నిర్వహిస్తున్న సభకు హాజరయ్యేందుకు వచ్చిన మోడీ ముందుగా మల్లిఖార్జున స్వామి దేవస్దానానికి వెళ్లారు. అక్కడ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత సభలో పాల్గొనబోతున్నారు.

ఉదయం ప్రధాని మోడీ కర్నూలు ఎయిర్ పోర్టుకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అక్కడి నుంచి సున్నిపెంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ప్రత్యేక హెలికాఫ్టర్ లో చేరుకున్నారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో శ్రీశైలానికి బయలుదేరారు. ప్రధానితో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీశైలం వెళ్లారు. సుండిపెంట హెలీప్యాడ్ నుంచి రోడ్ మార్గంలో శ్రీశైలానికి ప్రధాని చేరుకున్నారు. దాదాపు ఏడు గంటల పాటు నంద్యాల, కర్నూలు జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటన సాగనుంది.

PM Modi Visits Srisailam Temple with Chandrababu Pawan Kalyan

శ్రీశైలం దేవస్థానానికి చేరుకున్న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు వేదపండితులు వేద మంత్రోచ్ఛారణలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. శ్రీశైలం ఆలయాన్ని ప్రధాని మోడీ తొలిసారి సందర్శిస్తున్నారు. దీంతో ఆలయ విశిష్టతలను సీఎం చంద్రబాబు, అధికారులు ఆయనకు వివరిస్తున్నారు. ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సభా స్ధలికి వెళ్తారు.

శ్రీశైలం ఆలయంలో ప్రధాని మోడీ భ్రమరాంబ, మల్లిఖార్జున స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మల్లి ఖార్జున స్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం, భ్రమరాంబా దేవీకి ఖడ్గమాల, కుంకుమార్చన నిర్వహించారు. అత్యంత సంప్రదాయబద్దంగా ప్రధాని మోడీ కాషాయ కండువా ధరించి ఈ పూజల్లో పాల్గొన్నారు. మోడీతో పాటు చంద్రబాబు, పవన్ కూడా ఈ పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఆలయం మొత్తం కలియదిరిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+