కేసీఆర్ ఒప్పుకోలేదా: దేవినేని, నొప్పి ఎందుకో: బొండా

హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ విషయమై తెలంగాణ ప్రభుత్వం పైన ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం ధ్వజమెత్తారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. నాడు పోలవరం ఆర్డినెన్స్‌కు కేసీఆర్ ఒప్పుకోలేదా అని ప్రశ్నించారు. అప్పుడు ఆర్డినెన్స్‌కు ఒప్పుకొని ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడటం విడ్డూరమన్నారు.

నాడు ఎంపీగా కేసీఆర్ ఒప్పుకున్న ఆర్డినెన్స్‌ను నేడు అదే తెరాస పార్టీకి చెందిన ఎంపీలు అడ్డుకోవడం సరికాదన్నారు. పోలవరం ఆర్డినెన్స్ పైన మాట మార్చవద్దన్నారు. దేవినేని ఉమామహేశ్వర రావు గురుకుల్ ట్రస్ట్ కూల్చివేతల పైన కూడా మండిపడ్డారు. అక్రమ కట్టడాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం నిర్మాణాలను కూల్చివేసిందని అయితే, ఆ పక్కనే ఉన్న మంత్రుల ఇళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

భద్రాచలం కోసం ఉద్యమిస్తాం: బొండా ఉమ

తెరాస ఎంపీలు ఆంధ్రపద్రేశ్ ప్రజల సహనాన్ని పరీక్షించొద్దని టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ విజయవాడలో అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కేసీఆర్ సమర్ధించిన విషయం టీఆర్ఎస్ ఎంపీలు మర్చిపోవద్దన్నారు. యూపీఏ రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంను ఎన్డీయే ప్రతిపాదిస్తే తెరాసకు నొప్పులు ఎందుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు.

Polavaram: Devineni questions T government

పోలవరం ఆర్డినెన్స్ పైన తెరాస ఎంపీలు ఉద్యమిస్తే.. భద్రాచలం, మునగాల కోసం తాము ఉద్యమిస్తామన్నారు. తాము ఉద్యమించే పరిస్థితి తేవద్దని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతా చూస్తున్నారని, తమ సహనానికి కూడా ఓ హద్దు ఉందన్నారు. తెలంగాణ ప్రజలకు చెప్పినట్టు దేశానికి కూడా అబద్ధాలు చెప్పొద్దన్నారు. నాడు కేసీఆర్ ఒప్పుకున్నాక నేడు ఆ పార్టీ ఎంపీలు ఎలా వ్యతిరేకిస్తారన్నారు.

గవర్నర్‌ను కలిసిన బీజేపీ ఎంపీలు

బీజేపీ తెలంగాణ నేతల బృందం గవర్నర్ నరసింహన్‌ను మంగళవారం కలిశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ పైన ఆయనకు వివరించారు. అనంతరం తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత డా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల్లో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దీంతో రీయింబర్స్‌మెంట్ పైన అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దీనిపై రెండు ప్రభుత్వాలు చర్చించుకోవాలని సూచించారు. రీయింబర్స్ మెంట్ విషయంలో జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+