పోలవరం పనులకు తొలగిన అడ్డంకి: కేంద్రం క్లియరెన్స్
న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్ట్ పనులకు ప్రధాన అడ్డంకి తొలగింది. పోలవరం పనుల నిలిపివేత ఆదేశాలపై ఉన్న స్టే ను మరో ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో పోలవరం పనులకు ఎలాంటి అంతరాయం తలెత్తకుండా కొనసాగనున్నాయి.

పోలవరంపై నితిన్ గడ్కరీ సమీక్ష
పోలవరం పనుల పురోగతిపై కేంద్రమంత్రి గడ్కరీ సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పునరావాసం, ఆర్థికసాయం అంశాల్లో సవరించిన అంచనాలపై ఉన్నతాధికారులతో చర్చించారు.


ఈ సమీక్షలో జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. జులై 11న పోలవరం ప్రాజెక్టును గడ్కరీ సందర్శించనున్నారు. ఈ పర్యటనకు ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అన్ని అంశాలను అధికారులను గడ్కరీ అడిగి తెలుసుకున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!