Polavaram: పోలవరానికి కేంద్రం మరో గుడ్ న్యూస్-ఇక పరుగులే..!

ఏపీకి జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు (polavaram project) నానాటికీ ఆలస్యమవుతూ వస్తోంది. దీనికి నిధుల కొరతతో పాటు సాంకేతిక సమస్యలూ కారణంగా ఉన్నాయి. మరోవైపు కేంద్ర జలసంఘంతో పాటు విదేశీ నిపుణుల బృందాలు తనిఖీలు నిర్వహిస్తూ అవసరమైన సలహాలు, సూచనలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం పోలవరం ప్రాజెక్టుకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. బడ్జెట్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఓ విజ్ఞప్తిని కేంద్రం మన్నించింది.

పోలవరం ప్రాజెక్టుకు మూడో విడత నిధుల అడ్వాన్స్ గా రూ.1508 కోట్లను విడుదల చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు రూ.5936 కోట్లను కేటాయించిన కేంద్రం.. గత బడ్జెట్ తర్వాత అడ్వాన్స్ గా ఇచ్చిన నిధుల్ని ఖర్చు చేయడంతో దాన్ని కాస్తా రూ.3017 కోట్లకు సవరించింది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఇచ్చే నిధుల్లో అడ్వాన్స్ గా రూ.1508 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్రం దీన్ని అంగీకరించింది.

Polavaram Mega-Project Receives Crucial 1 500 Crore Advance from Central Government

అలాగే ఈ రూ.1508 కోట్ల నిధుల్ని మార్చి 15లోగా ఖర్చు చేస్తే అంటే ఇవాళ్టి లోపు ఖర్చుపెడితే ప్రస్తుత బడ్జెట్ లో కేటాయించిన మిగిలిన నిధుల్నీ విడుదల చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ నోడల్ ఖాతాలో జమ అయిన నిధుల్ని పోలవరం ఖాతాకు వెంటనే విడుదల చేస్తోంది. ఇందులో పోలవరం పనుల కోసం రూ.500 కోట్లు, పునరావాసం కోసం మరో రూ.500 కోట్లు, ఇతర అవసరాల కోసం మరో రూ.508 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇప్పటివరకూ ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత పోలవరానికి రూ.5512.40 కోట్లు నిధులు అందాయి. ఇప్పుడు రూ.1508 కోట్లు అందాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+