రాజమండ్రిలో మసీదు మౌజస్ హంతకుడి అరెస్ట్
రాజమండ్రి: రాజమహేంద్రవరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మసీదు మౌజస్ దారుణ హత్యకు సంబంధించి హంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మౌజస్ హత్యపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు హత్య కేసులో నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సిఎం ప్రకటించిన గడువులోగానే పోలీసులు హంతకుడిని అరెస్ట్ చేయడం గమనార్హం.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజమండ్రి మసీదు మౌజస్ హత్యకు పాల్పడిన నిందితుడిని సోమవారం ఉరవకొండలో పోలీసులు అరెస్ట్ చేశారు. కారణాలేమిటనేది ఇంకా బైటకు వెల్లడించలేదు. అయితే ఈ హత్యకు సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ నుంచి సమీక్షించినట్లు తెలిసింది.

హత్య జరిగిన 48 గంటల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి అని రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీకి సూచించారు.












Click it and Unblock the Notifications