గౌతమి మృతిపై తేల్చేసిన రత్న: ప్రశ్నలకు జవాబులు దాటవేత

సోదరి పావని మొత్తుకుంటున్నా పోలీసులు మాత్రం గౌతమిది ప్రమాదమేనని తేల్చేశారు. మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదం చేశారని అంటున్నారు.

ఏల్లూరు: సోదరి పావని మొత్తుకుంటున్నా పోలీసులు మాత్రం గౌతమిది ప్రమాదమేనని తేల్చేశారు. మద్యం మత్తులో కారు నడిపి ప్రమాదం చేశారని అంటున్నారు. గౌతమి మృతిపై ఎట్టకేలకు పోలీసు ఉన్నతాధికారులు స్పందించారు. ఈనెల 14న విశాఖపట్నంలో పాసల సందీప్‌ టాటా సఫారీని సత్యనారాయణ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేశాడని, డ్రైవర్‌గా ప్రసాద్‌ అనే వ్యక్తిని నియమించుకున్నాడని చెప్పారు.

ఈ నెల 15న రాత్రి ఇద్దరు కలసి భీమవరంలో కోడి పందాలు చూసేందుకు వెళ్ళారని, పాలకొల్లు రైల్వే బైపాస్‌ రోడ్డులో 16న కోడి పందాలు, గుండాట, పేకాట ఆడి అధికంగా మద్యం సేవించారని తెలిపారు. సమీపంలోని రా యల్‌ రెసిడెన్సీ లాడ్జీలో 17న సాయంత్రం వరకు విశ్రాం తి తీసుకుని విజయవాడ బయలుదేరారన్నారు.

విజయవాడలో సందీప్‌ అద్దెకు ఉండే ఇంటి యజమాని రాధిక రాణి ఇంట్లో ఉన్నారని, 18న తిరిగి బయలుదేరి తాడేపల్లిగూడెం మీదుగా మొగల్తూరు చేరుకున్నారని చెప్పారు. మొగల్తూరులో సందీప్‌ స్నేహితుడు కాటం సేవన్య అలియాస్‌ టోనీతో కలసి మద్యం సేవించి విశాఖపట్నం బయలు దేరారని చెప్పారు.

పాలకొల్లు రైల్వే బైపాస్‌ రోడ్డు వరకు వచ్చేసరికి మద్యం మత్తు కారణంగా వెనుతిరిగి మొగల్తూరు వెళుతున్నారని, అలా వెళ్తూ స్కూటీని ఢీకొట్టారని, ఆ కంగారు వల్ల, మద్యం మత్తులో ఉన్నందున 100 మీటర్ల వరకు కారును కం ట్రోల్‌ చేయలేకపోయారని, దీంతో గౌతమి మృతి చెందిందని తెలిపారు.

ఈ నెల 18న జరిగిన సంఘటన వివరాలు కేసు విచారణాధికారి, ఏఎస్పీ వై.రత్న గురువారం పాలకొల్లు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. అయితే, మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారు.

Police clarifies on Goutami's death in AP

పాలకొల్లు-నరసాపురం రహదారిలో దిగమర్రు వద్ద జ రిగిన సంఘటనలో గౌతమి మృతిచెందడం, ఆమె సోదరి పావని తీవ్రగాయాలతో బయట పడడం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కోలుకున్న అనంతరం పావని ఈ నెల 22న వివరాలు చెప్పింది. ప్రమాదం కాదని, ప్రణాళిక ప్రకారం హత్య చేశారని ఆరోపించింది.

గౌతమిది హత్య కాదని రోడ్డు ప్రమాదమేనని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పోలీసులు విచారణ నిమిత్తం రెండు బృందాలను ఏర్పాటుచేసి విశాఖపట్నం, విజయవాడకు పంపించి విచారించామన్నారు. సీసీ పుటేజీ, టోల్‌ప్లాజా డేటా, పెట్రోల్‌ బంకుల వద్ద విచారించామన్నారు. ప్రత్యక్ష సాక్షులను కూడా విచారించామని, వారంతా ప్రమాదమేనని చెప్పారని వివరించారు.

సంఘటన జరిగిన రోజు పాలకొల్లులోని కృష్ణభవాని ఆసుపత్రికి గౌతమి, పావని స్కూటీపై వచ్చారని ఏఎస్పీ తెలిపారు. గౌతమి వివాహం చేసుకున్న బుజ్జి అసలు ఫోన్‌ చేయలేదని స్పష్టం చేశారు. బుజ్జి, మృతురాలి సోదరి పావనికి స్నేహితుడైన రమేష్‌ ఫోన్‌ కాల్స్‌ పరిశీలించామని చెప్పారు.

మొత్తం 13 ఫోన్‌కాల్స్‌లో పావని 10 ఫోన్‌ కాల్స్‌ రమేష్‌కు చేసిందని, రమేష్‌ మూడు కాల్స్‌ మాత్రమే చేశాడని తెలిపారు. బుజ్జి మొదటి భార్య శిరీష ఫ న్‌చేసి బెదిరించిన ఆరోపణల నేపథ్యంలో ఫోన్‌కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌ డేటా పరిశీలించామని, ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.

ఈ ప్రశ్నలకు జవాబులు దాటవేత...

ఈ నెల 14 నుంచి 18 వరకు కారులో తిరుగుతూ, లాడ్జీల్లో బస చేసిన వారికి దుస్తులు, ఇతర లగేజీ లేదా అని విచారణాధికారిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. సాయంత్రం 6 గంటలకే పుట్‌పాత్‌ వ్యాపారులు వెళ్ళిపోతే సుమారు రాత్రి 8.30 గంటలకు జరిగిన సంఘటనకు పండ్ల వ్యాపారి ఎలా ప్రత్యక్ష సాక్షి అని విలేకర్లు ప్రశ్నించారు.
ప్రమాదం అనంతరం వారు కారులోంచి బయటపడి ఎక్కడికి.. ఎలా వెళ్ళారు అనే ప్రశ్నలకు ఏఎస్పీ రత్న సమాధానాలు దాటవేశారు. మద్యం మత్తులో ఉన్నవారు సంఘటనాస్థలం నుంచి స్థానికులకు సైతం దొరక్కుండా ఎలా పారిపోయారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగానే మిగిలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+