తెలుగు రాష్ట్రాల మధ్య వాహన సంచారానికి గ్రీన్ సిగ్నల్, వరదల దెబ్బకు బ్రేక్
భారీ వర్షాలు, వరదల దెబ్బతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచి నుంచి మన విషయం తెలిసిందే. నందిగామ మండలంలోని ఐతవరంలో వరద తగ్గడంతో సోమవారం రాత్రి వరకు నిలిచిపోయిన వాహన సంచారానికి పోలీసు అధికారుల అనుమతి ఇచ్చారు. ఐతవరంలో సోమవారం సాయంత్రం వరకు నిలిచిపోయిన వాహనాలను పోలీసులు దగ్గరుండి ఆ వాహనాలను అక్కడి నుండి సురక్షితంగా పంపిస్తున్నారు.
హైదరాబాద్- విజయవాడ హైవే పై వాహనాలు సంచారానికి పోలీస్ అధికారులు అనుమతిస్తున్నారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వాహన సంచారానికి పోలీసులు అధికారం అనుమతి ఇవ్వడంతో వాహనచోదకులు ఊపిరి పీల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరం వద్ద వరద ప్రవాహం సోమవారం సాయంత్రానికి చాలా వరకు తగ్గింది. మైలవరం ఎమ్మెల్యే వెంకట కృష్ణ ప్రసాద్ పోలీసు అధికారులు, ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన హైడ్రా వాహనంలో ఎక్కి వరద ప్రవాహాన్ని దాటుకున్నారు.

మైలవరం అసెంబ్లీ నియోజకవర్గంలోని వరద ప్రాంతంలో ఎమ్మెల్యే వెంకట కృష్ణ ప్రసాద్ పర్యటిస్తున్న విషయం తెలిసిందే. తన స్వగ్రామం అయిన ఐతవరం గ్రామానికి ఎమ్మెల్యే వెంకట కృష్ణ ప్రసాద్ వెళ్లారు. మధ్యలో వరద ఉండటంతో మైలవరం ఎమ్మెల్యే వెంకట కృష్ణ ప్రసాద్ హైడ్రా అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో ప్రయాణించారు. ఐతవరం జాతీయ రహదారిపై వరద ప్రభావం వరద ప్రవాహం ఉన్నచోట వంతెన నిర్మాణం గురించి హైవే అథారిటీ అధికారులతో సమావేశం నిర్వహించి చర్చలు జరుపుతామని మైలవరం ఎమ్మెల్యే వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు.
ఇక విజయవాడలోనే మకాం వేసిన సీఎం చంద్రబాబు నాయుడు వరద ముంపు ప్రాంతాలపై సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతూ వరద బాధిత ప్రాంతాలల్లోని ప్రజలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేస్తున్నారు. విజయవాడలోని వరద ముంపు ప్రాంతాల్లో త్వరలోనే మామూలు పరిస్థితికి వస్తుందని, ప్రభుత్వం అందరినీ అన్ని విధాల ఆదుకుంటుందని సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడ ప్రజలకు మనవి చేస్తున్నారు.












Click it and Unblock the Notifications