లోకేష్ పర్యటనకు అనుమతిలేదు- రాజకీయంగా రాద్దాంతం సరికాదు :పోలీసు అధికారులు..!!
గుంటూరు జిల్లాలో జరిగిన ఆడపిల్లల హత్య కేసులో పోలీసులు వెంటనే పట్టుకోవడం జరిగిందని రేంజ్ ఐజీ త్రివిక్రమ్ వర్మ చెప్పారు. కొంతమంది మాత్రం దిశా చట్టం మీద అనవసర రాద్ధాంతం చేస్తున్నారని..
జీరో ఎఫ్ ఐ ఆర్ కింద చాలా కేసులు నమోదు చేసామన్నారు. ఇప్పటికే దిశా యాప్ నుంచి ప్రతిరోజు ఫోనులు వస్తున్నాయని వివరించారు. వెంటనే పోలీసులు స్పందిస్తున్నారని...ఇప్పటికే7రోజుల సమయంలో 1600కేసులు నమోదుచేసి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
ఆడపిల్లలను ఇబ్బందులకు గురిచేస్తున్న వారిపై త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దిశా చట్టం అనేది నేటి సమాజానికి ఒక సంరక్షణ కలిగించే గోడుగులాంటిదన్నారు. నెల్లూరులో జరిగీన ఘటనపై వివరణ ఇచ్చారు. దిశా చట్టం వచ్చిన తర్వాత దిశ యాప్47లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని వెల్లడించారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ కొన్ని రాజకీయ పార్టీలు నరసరావుపేట లో జరిగిన ఘటనలో అనవసర రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రేపు టీడీపీ నేత లోకేష్ పర్యటనకు అనుమతిలేదని స్పష్టం చేసారు.

బాధితులకు న్యాయం జరిగేలా పోలీసులు పనిచేస్తున్నారన్నారు. ఈరోజు డిఐజి, ఎస్పీలు వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెట్టె పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రేపు లోకేష్ పర్యటన రాజకీయంగా ఉందని, అనుమతిలేని పర్యటనలకు రాజకీయ నాయకులు రావద్దని స్పష్టంచేశారు. ఎస్సి ఎస్టీ కమిషన్ సభ్యులు వచ్చినప్పుడు పోలీసులు తీసుకున్న చర్యలకు అభినందనలు తెలియజేశారని వివరించారు.
అర్బన్ ఎస్పీ ఆరీఫ్ హఫిజ్ రమ్య హత్య పైన స్పందించారు. రమ్య హత్యఘటనలో అర్బన్ పోలీసులు గంటల వ్యవధిలో నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసామని చెప్పారు.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పండుగ ప్రజలు చేసుకోవాలని కోరారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే, ఇదే అంశం మీద అంతుకు ముందు నర్సరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి సైతం స్పందించారు. నారా లోకేష్ నరసరావుపేటకు ఎందుకోసం వస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న నరసరావుపేటలో శవ రాజకీయాలు చేయటానికి వస్తున్నారా.. లేక మీ రాజకీయ లబ్ది కోసమా అని ప్రశ్నించారు.
గుంటూరులో రమ్య హత్యకు గురైతే... ఆ రోజు శవాన్ని అడ్డుపెట్టుకుని ఎంతగా నీచ రాజకీయాలు చేశారో రాష్ట్ర ప్రజలంతా చూశారు. ప్రభుత్వాసుపత్రి నుంచి మృతదేహాన్ని తరలిస్తుంటే అడ్డుపడి, తెలుగుదేశం పార్టీ చేసిన రచ్చ అతి నీచమైందంటూ మండిపడ్డారు. అయితే, టీడీపీ నేతలు మాత్రం లోకేశ్ పర్యటనకు వస్తున్నారని చెబుతున్నారు. దీంతో..పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా దివంగత స్పీకర్ కోడెల కుమారుడు శివ ప్రసాద్ ను హౌస్ అరెస్ట్ చేసారు.












Click it and Unblock the Notifications