ఒకే నెంబర్‌తో 2 కార్లు, పొంతన లేని సమాధానాలు: ఉగ్రవాదులా?
హైదరాబాద్/కర్నూలు: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్‌లతో వణుకుతుండగానే.. మరోవైపు కర్నూలు, రంగారెడ్డి జిల్లాలో అనుమానితుల కలకలం చెలరేగింది. కర్నూలు జిల్లాలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
వారు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అనుమానితులు వచ్చిన రెండు కార్లకు ఒకే నెంబర్ ఉండటం గమనార్హం. వారు ఉగ్రవాదులా కాదా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే, వారి రెండు కార్లకు ఒకే నెంబర్ ఉండటం, పోలీసుల విచారణలో పొంతన లేని సమాధానం చెబుతుండటం అనుమానాలకు తావిస్తోంది.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బంట్వారంలో తప్పించుకున్న సిమి ఉగ్రవాదుల్లో ఒకరిని చూసినట్లు స్థానికులు చెబుతుండటం కలకలం రేపుతోంది. ఆగంతకుడు ఏకే-47తో బెదిరించాడని ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. లారీలో నుంచి దిగిన అతనితో పాటు మరో వ్యక్తి కూడా ఉండవచ్చని చెబుతున్నారు.

నల్లటి టీ షర్టు, బ్లూ జీన్స్ వేసుకున్న వ్యక్తి తన వైపు ఏకే-47 గురిపెట్టి బెదిరించాడని చెప్పారు. అతని వద్ద మరో రెండు ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు.
లారీ అడ్డుగా ఉండటం వల్ల మరో వ్యక్తిని తాను గుర్తించలేదని, పేపర్లలో ఉన్న ఫోటోలను బట్టి తాను చూసింది తప్పించుకున్న సిమి ఉగ్రవాదుల్లో ఒకడైన మహబూబ్‌లా ఉన్నాడని చెప్పారు. భయం వల్ల వారు ఎటు వెళ్లింది గుర్తించలేదని చెప్పారు. పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
నార్కట్ పల్లిలో అస్లాం మృతదేహానికి అంత్యక్రియలు
నల్గొండ జిల్లా జానకీపురం ఎన్ కౌంటర్లో మృతి చెందిన ఉగ్రవాది అస్లాం మృతదేహాన్ని మగళవారం నాడు నార్కట్ పల్లిలో ఖననం చేశారు. అతని మృతదేహాన్ని తీసుకు వెళ్లేందుకు ఎవరు రాకపోవడంతో పోలీసులు ఖననం చేశారు.












Click it and Unblock the Notifications