భారీగా దొంగ సొత్తు స్వాధీనం
ఏలూరు: తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా దొంగ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరుకు చెందిన ప్రధాన నిందితుడు నాగమల్లేశ్వర రావు, నాగరాజులతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన షేక్ అజిజ్, సమీరా, మస్తాన్‌లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21 లక్షల నగదుతో పాటు బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. వీరిపై 17 రకాల దొంగతనం కేసులు నమోదయ్యాయి. ఏడుగురు ముఠా సభ్యుల్లో మరో ఇద్దర్ని అరెస్టు చేయవలసి ఉంది.












Click it and Unblock the Notifications