ఏడుగురు ఇంజనీర్లను కాపాడిన పోలీసులు:స్నానానికని దిగితే...ప్రాణాలకే ముప్పు వచ్చింది
తూర్పుగోదావరి:నదిలో స్నానం చేద్దామని సరదా పడితే ఆ ఉబలాటం ప్రాణాల మీదకు తెచ్చిన ఉదంతమిది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి కాపాడాటంతో ప్రాణాలు దక్కించుకుని బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి బయట పడ్డారు. అసలేం జరిగిందంటే?
మోతుగూడెంలోని ఏపి జెన్కో లో అప్రెంటీస్ గా చేస్తున్న ట్రైనీ ఇంజనీర్లు సీలేరు నదిలో స్నానానికి దిగారు. అయితే ఉన్నట్టుండి సీలేరు నది ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమైంది. దీంతో ఈ ఇంజనీర్లు నది ప్రవాహం మధ్యలో చిక్కుకున్నారు. నీటి ప్రవాహం దిగువకు తోసేస్తుండటంతో అప్పటిదాకా సరదాగా కేరింతలు కొట్టిన ఆ యువ ఇంజనీర్లు ప్రాణ భయంతో కేకలు వేశారు.

అయితే నది మధ్యలో ఒక గుట్ట మీదకు చేరి సహాయం కోసం అరవడం చేశారు. దీంతో వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. వారిని ఒక్కొక్కరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసులు వెంటనే స్పందించడంతో ప్రాణాలు దక్కాయని, లేకుంటే చనిపోవడం ఖాయమని ఇంజనీర్లు కృతజ్ఞతలు తెలిపారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు












Click it and Unblock the Notifications