కార్యాలయాలు: బెజవాడ నుండే పార్టీలు రాజకీయం!

ఇందుకోసం విజయవాడలో పార్టీలు కార్యాలయాలను ఏర్పాటు చేసుకునే విషయంపై దృష్టి సారించాయి. మరోవైపు గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటు చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. దాదాపు అది సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో పార్టీలు బెజవాడ పైన దృష్టి సారిస్తున్నాయి. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని పదమూడు జిల్లాలకు విజయవాడ కేంద్రంగా ఉంటుంది.
ఇప్పటికే బిజెపి విజయవాడలో కార్యాలయాన్ని స్థాపించేందుకు స్థల సేకరణ ప్రయత్నాలు ప్రారంభించిందట. ఇక కాంగ్రెసు పార్టీ ప్రస్తుతం ఉన్న జిల్లా కార్యాలయం ఆంధ్ర రత్న భవనంను రాష్ట్ర కార్యాలయంగా వినియోగించుకోవాలని చూస్తోందట. ఇందుకోసం కార్యాలయానికి మరమ్మతులు చేయడానికి సిద్ధమైంది.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, సిపిఎం, సిపిఐ తదితర పార్టీలు కూడా విజయవాడలోనే పార్టీ రాష్ట్ర కార్యాలయాలను ఏర్పాటు చేసుకోనున్నారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లా ఎపి పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని టిడిపి యోచిస్తోంది. సిపిఎం గత కార్యాలయాన్ని పడగొట్టి కొత్తగా.. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా నిర్మించనుంది. మరో నాలుగైదు నెలల్లో ఆయా పార్టీలు బెజవాడ నుండి కార్యకలాపాలను సాగించనున్నారు.












Click it and Unblock the Notifications