వ్యూహకర్తల ''వ్యూహం''లో చిక్కుకున్న రాజకీయ నేతలు??
చదువుకోకముందు కాకరకాయ అన్నాడంట.. చదువుకున్న తర్వాత కీకరకాయ అన్నాడంట. ఇది తెలుగులో ఒక సామెత. ప్రజల సొమ్ముతో ఐఐటీల్లో చదివి ఆ ప్రజల మధ్యే రాజకీయ వ్యూహకర్తల పేరుతో చిచ్చులు పెట్టడానికి తయారవుతున్నారు. కుటిల రాజకీయ నీతిని ఒంటబట్టించుకొని విలువలు, సిద్ధాంతాలు లాంటివి లేకుండా కేవలం డబ్బే లోకంగా జీవించడానికి, రాష్ట్రాల్లో, దేశంలోని రాజకీయ ప్రముఖులతో చనువుగా ఉంటూ తాము ఆర్థికంగా, వ్యక్తిగతంగా ఎదగడానికి మాత్రమే వీలవుతుంది.
లేదంటే కొన్ని సంవత్సరాల నుంచి వారిని దగ్గరగా చూడటంవల్ల వారు అనుభవించే అధికారం మీద వ్యామోహం కలిగితే పార్టీ పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. వీరివల్ల అంతకుమించి దేశానికి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పవచ్చు.

తామర తుంపరలుగా పెరిగిపోతున్న వ్యూహకర్తలు
ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలకు వ్యూహాలు రచించేవారు పెరిగిపోయారు. ఎదుటి పార్టీ బలాలు, బలహీనతలు తెలుసుకోవడం, తమకు ప్యాకేజీ ఇచ్చిన పార్టీల బలహీనతలను కప్పిపుచ్చడానికి సోషల్ మీడియాను వాడుకోవడం, ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో తప్పుడు పోస్టులు పెట్టడం, కొన్ని ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి వాటిల్లో పోస్టులు పెడుతూ అవి ఫలానా రాజకీయ పార్టీవారే పెట్టారు అనేలా ప్రజల్లో నమ్మకం కల్పించేలా ఈ వ్యూహకర్తలు చేస్తారు. ఈ క్రమంలో అనేక విలువలకు తిలోదకాలివ్వాల్సి ఉంటుంది. తాము తప్పు చేస్తున్నామనే భావనే వారిలో కనపడటంలేదంటే అతిశయోక్తి కాదు.

రాజకీయ వ్యూహకర్త అంటే ఫ్యాషనైపోయింది
ఐఐటీల్లో సీటు రావడమంటే ఎంతో మేథోశక్తి ఉంటేకానీ సాధ్యం కాదు. అటువంటి సంస్థల్లో చదువుకొని దేశానికి ఉపయోగపడేలా పనిచేయాలంటూ అబ్దుల్‌కలాంటివారు ఉద్భోదించేవారు. విదేశాలకు వెళ్లినా మన మూలాలు మరిచిపోకుండా మాతృభూమికి చేదోడు వాదోడుగా నిలవాలంటూ హితబోధ చేసేవారు. కానీ ఇటీవలికాలంలో రాజకీయ వ్యూహకర్త అనిపించుకోవడం ఒక ట్రెండ్ గా మారింది. సర్వేల పేరుతో ఫలానా ఎమ్మెల్యేకానీ, ఎంపీకానీ బలహీనంగా ఉన్నారంటూ వారిలో ఒక అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తుంటే ఎన్నికల్లో సీటు కాపాడుకోవడానికి వారంతా పార్టీ అధినేతలు కాకుండా వ్యూహకర్తల చుట్టూ తిరగడం చేస్తున్నారు.
ఎవరికి సీటివ్వాలి.. ఎవరికి సీటివ్వకూడదు.. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు, ప్రత్యర్థుల బలాబలాలపై కూడా సర్వే నిర్వహించి నివేదిక రూపొందిస్తారు. పార్టీ అధినేతలందరూ కళ్లు మూసుకొని ఆ నివేదిక ఆధారంగానే అడుగులు ముందుకు వేస్తున్నారు

సొంత బలాలు కూడా మరిచిపోతున్న సీనియర్ రాజకీయ నేతలు
రాజకీయ పార్టీల అధినేతలు కూడా తమ సొంత బలాబలాల గురించి అంచనా వేసుకోవడం మరిచిపోయారు. రాజకీయ వ్యూహకర్తల వ్యూహంలో తాము కూడా చిక్కుకున్నామనే వాస్తవాన్ని గ్రహించడంలేదు. సొంత బలాన్ని, సొంత వ్యూహాన్ని మరిచిపోయి వ్యూహకర్తలపై ఆధారపడుతున్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి తాము నడుపుతున్న రాజకీయంకన్నా, తాము వేసిన ఎత్తులకన్నా, ప్రత్యర్థులను చిత్తుచేసిన వ్యూహాలకన్నా వారే ఎక్కువనే భ్రమల్లో ఉన్నారు. ఆ భ్రమల్లోనే పార్టీ భవిష్యత్తులను ఒకరిద్దరు వ్యక్తుల చేతుల్లో పెడుతున్నారు.

రాహుల్‌గాంధీకి ఉన్న విజ్ఞత ఉంటే చాలు?
ఇటీవల రాహుల్‌గాంధీ శతాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక వ్యక్తి చేతిలో పెట్టడాన్ని పూర్తిగా వ్యతిరేకించారు. సొంతబలాన్ని నమ్ముకొని, నాయకులు, కార్యకర్తలను కార్యోన్ముఖులను చేసుకొని ఎన్నికల యుద్ధానికి వెళ్దామని హితబోధ చేశారు. రాజకీయాల్లో జూనియర్ అయిన రాహుల్‌గాంధీకి ఉన్న విజ్ఞత సీనియర్ నాయకులకు లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-
పెమ్మసానికి అంబటి స్ట్రాంగ్ వార్నింగ్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications