వైసీపీలో ఆ ముగ్గురే టార్గెట్: టీడీపీ నేతల ఎదురుదాడి
అమరావతి: వైయస్ జగన్‌కు చెందిన 'సాక్షి' దినపత్రిక ఏపీ రాజధాని అమరావతిలో భూదందా అంటూ వరుస కథనాలను ప్రచురించడంతో ఏపీలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. రైతులను మోసం చేసి రాజధాని ప్రాంతంలో అన్యాయంగా భూములు లాక్కున్నారంటూ వైసీపీకి చెందిన పలువులు నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే టీడీపీ చెందిన నేతలు మాత్రం డబ్బులు పెట్టిన భూములు కొనుక్కునంటే తప్పేమి లేదంటున్నారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన ఎమ్మెల్యే రోజా, బొత్స సత్యనారాయణలు టీడీపీ నేతల భూదందాపై విచారణకు ఆదేశించాలని కోరారు.
అయితే వైసీపీ నేతలు ఆరోపణల్లో నిజం లేదంటూ, నవ్యాంధ్ర అభివృద్ధికి అడ్డుపడుతున్న సాక్షి దినపత్రికపై టీడీపీ నేతలు కేసులు పెడుతున్నారు. అంతేకాదు వైసీపీ నేతలు, సాక్షి పత్రికపై కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు నేతలు ఎదురుదాడికి దిగారు.
సోమవారం అమరావతి భూదందాపై టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన నేతలు ఎవరేమన్నారో ఒక్కసారి చూద్దాం. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే రోజా సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కీచక పాలన సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చంద్రబాబుకు మహిళలు అంటు చులకన అన్నారు. చంద్రబాబుకు, టిడిపి నేతలకు మహిళా దినోత్సవం జరుపుకునే అర్హత లేదన్నారు. మహిళల సమస్యల పైన పోరాడే తమ పైన ఎదురుదాడి సరికాదన్నారు. గత మార్చి 8 నుంచి ఈ మార్చి 8 వరకు జరిగిన ఘటనల పైన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
నారా లోకేష్, ఇతర టిడిపి నేతలను చూసి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కూడా టంగ్ స్లిప్ అయ్యారన్నారు. లోకేశ్ గతంలో తన స్నేహితులతో కలిసున్న ఫోటోలను చూపుతూ, ఈయనా యువనేత? అని ప్రశ్నించారు. మందు, విందులతో కాలం గడిపే లోకేశ్ కార్యకర్తలకు ఎలాంటి సంకేతాలు పంపుతున్నారని అడిగారు.
బాలకృష్ణ అమ్మాయిలను అవమానించేలా మాట్లాడారని, అమ్మాయిలను చూస్తే తప్పేమిటని టిడిపి నేతలు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణలో జరిగింది కాబట్టి రావెల సుశీల్ పైన కేసు పెట్టారని, ఏపీలో జరిగి ఉంటే మాత్రం కుక్క పేరు చెప్పి తప్పించుకునే వారని ఎద్దేవా చేశారు.
చిత్తకార్తి కుక్కలా మంత్రి రావెల తనయుడు వ్యవహరించారని మండిపడ్డారు. నడి రొడ్డు పైన మంత్రి కొడుకు యువతి చేయి పట్టుకొని లాగలేదా అని ప్రశ్నించారు. టిడిపి నేతలు ప్రతి దానినీ జగన్ పైకి నెడుతున్నారని రోజా మండిపడ్డారు. రోజా వ్యాఖ్యలపై టీడీపీకి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు కూడా అంతే ధీటుగా స్పందించారు.

తమ పార్టీకి మహిళలు అంటే గౌరవమని, మహిళలే తమ పార్టీకి అండ అని, కానీ రోజా లాంటి ఐరన్ లెగ్ ఆంటీలు అంటే మాత్రం అసహ్యమని టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ సోమవారం అన్నారు. 'ఇంతకుముందే రోజా ఏదో మాట్లాడారట.. టిడిపి సభ్యులకు మహిళల పట్ల గౌరవం లేదని చెప్పారట.. అసలు మహిళల పట్ల ఎవరికి గౌరవం లేదో రోజా ఆలోచించాలి. మేకప్పుతో రావొద్దని చెప్పిన జగన్‌కు గౌరవం లేదు' ఈ విషయం ఆలోచించాలని సూచించారు.
మహిళలంటే టిడిపికి అసహ్యం కాదని, మహిళలే తమకు అండదండా అన్నారు. ఐరన్ లెగ్ ఆంటీలు అంటే తమకు అసహ్యం అని రోజాను ఉద్దేశించి అన్నారు. ప్రజల కోసం పోరాడమని గెలిపిస్తే.. రోజా బూతుల రాణిగా, సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారన్నారు. ఓ మహిళా ఎమ్మెల్యే సస్పెండ్ కావడం దాదాపు ఇదే మొదటిసారి అని, ఆ ఖ్యాతి మాత్రం రోజాకే దక్కిందన్నారు. ఇప్పటికైనా రోజా తన పద్ధతి, మాటతీరు మార్చుకోవాలన్నారు.
ఎమ్మెల్యే రోజాపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రోజాను పదవి కాలం మొత్తం శాసనసభ నుంచి బహిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. రోజా నోటికి వచ్చినట్లు ఇష్టానుసారం మాట్లాడుతోందని, ఆమె వాడుతున్న భాష వల్ల రౌడీ షీట్ ఓపెన్ చేయాలని అన్నారు.
మహిళలు రోజాకు బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. బజారు రౌడీలు కూడా అలా మాట్లాడరని, ప్రజాప్రతినధి అయిన రోజా మహిళాలోకం సిగ్గుతో తలదించుకునేవిధంగా ప్రవరిస్తున్నారని మండిపడ్డారు. ఆమె వాడిన మాటలు మనం మాట్లాడలేమని సోమిరెడ్డి అన్నారు. రోజాకు ఏడాది బహిష్కరించినా బుద్ధిరాలేదని, స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆమెను ఐదేళ్లపాటు అసెంబ్లీకి రాకుండా బహిష్కరించాలని సోమిరెడ్డి అన్నారు.
మరోవైపు రాజధాని అమరావతికి తాము వ్యతిరేకం కాదని వైసిపి నేత బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధాని భూదందాలపై విచారణ జరిపిస్తారా లేదా చెప్పాలన్నారు. రాజధాని ప్రకటన రాకముందే టిడిపి నేతలు అక్కడ ఎలా కొన్నారో చెప్పాలని నిలదీశారు. అసైన్డు భూములను ఎవరైనా కొనుక్కోవచ్చా? అని నిలదీశారు.
రాగద్వేషాలకు అతీతంగా పని చేస్తామని ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధులు అక్కడ భూములు ఎలా కొన్నారో చెప్పాలన్నారు. పెదబాబు సాంక్షన్లు చేస్తుంటే చినబాబు వసూళ్లు చేస్తున్నారని దుయ్యబట్టారు. వేమూరి రవి కుమార్ ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని చెప్పారు. ఆయనకు ఐటీ విభాగంలో ప్రధాన పదవిని కట్టబెట్టారని, లోకేష్ సన్నిహితుడని తెలుసని, ఆయన పేరు మీదే భూములు కొన్నారన్నారు.
అక్కడ భూములు కొంటే తప్పులేదని, కానీ అమెరికాలో ఉంటే వ్యక్తి ఎలా కొన్నాడో చెప్పాలన్నారు. నారాయణ ఇంకో మాట చెబుతారని, ఆయన సంస్థలో పని చేస్తున్న ప్రమీళ అనే మహిళ అక్కడ 17 ఎకరాలు కొన్నారని, ఆయన బావమరిది సాంబశివ రావు కూడా కొన్నారని, వీటన్నింటికి సమాధానం చెప్పకుండా కొనుక్కుంటే తప్పేమిటంటే ఎలా అన్నారు.
పక్క ఊరే కావడం వల్ల దూలిపాళ్ల నరేంద్ర కొనుక్కున్నారని అనుకోవచ్చునని, అయితే 50 ఎకరాల అగ్రిమెంటు, 3 ఎకరాల రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, అవన్నీ పోరంబోకు భూములని వాటిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నారు.
అమరావతి భూములపై అసత్యాన్ని పదేపదే ప్రచారం చేయడం ద్వారా సత్యమనే భ్రమను ప్రజల్లో కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు సోమవారం మీడియా సమావేశంలో అన్నారు. అగ్రిగోల్డ్ నుంచి స్వాధీనం చేసుకున్న భూములను తమ పార్టీ నాయకుడు నారా లోకేష్ కొన్నాడని అంటారా అని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు.
తమ పార్టీ నేత దూళిపాళ్ల నరేంద్రచౌదరి కోర్టుకు ఎక్కడంతో వైసిపి నేతల్లో వణుకు పుట్టిందని ఆయన అన్నారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటుచేసిన పత్రిక, ఛానెల్ ద్వారా దుష్ప్రచారం చేస్తూ మీడియాను వైసిపి అధినేత జగన్ తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారని కాల్వ శ్రీనివాసులు ఆరోపించారు.
అవినీతికి జగన్, అక్రమాలకు బొత్స ప్రతిరూపాలుగా నిలుస్తారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్రలో బొత్స వేలాది ఎకరాలు కొన్నారని ఆయన ఆరోపించారు. ఇలా టీడీపీ, వైసీపీ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదే మాటల యుద్ధం మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఉండొచ్చని అంటున్నారు.
-
ఏపీలో మహిళలకు దక్కే నియోజకవర్గాలు ఫిక్స్, కీలక మంత్రుల స్థానాలు సైతం..!! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications