వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్న సంఘటనలు తప్ప టీలో పోలింగ్ ప్రశాంతం

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: శాసనసభ, లోకసభ ఎన్నికల్లో బుధవారం ఉదయం 7 గంటలకు తెలంగాణవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభమైంది. తెలంగాణలోని పది జిల్లాల్లో పోలింగ్ మొదలైంది. తెలంగాణలోని 119 శాసనసభా స్థానాలకు, 17 లోకసభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. తెలంగాణవ్యాప్తంగా 30 వేలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

చెదురుమొదరు సంఘటనలు మినహా తెలంగాణలోని పది జిల్లాల్లో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు క్యూలో నిలుచున్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. హైదరాబాదులో అత్యల్పంగా పోలింగ్ శాతం నమోదైంది.

తెలుగుదేశం పార్టీ ఖమ్మం లోకసభ అభ్యర్థి నామా నాగేశ్వర రావుపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఖమ్మం జిల్లాలోని నేలకొెండపల్లి మండలం శంకరిగిరి తండాలో ఈ దాడి జరిగింది. ఈ దాడిలో నామా నాగేశ్వర రావు పిఎ గాయపడ్డాడు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి ఓటు చెల్లదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. పొత్తు ధర్మం ప్రకారం బిజెపికి ఓటేసినట్లు చంద్రబాబు చెప్పడం సరి కాదని, అలా వెల్లడించడం నిబంధనలకు విరుద్ధమని ఆయన చెప్పారు.

ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. జిల్లాలోని చర్ల మండలం ఉంజిపల్లి గ్రామంలో బాంబు పేల్చారు. కొన్ని ఈవిఎంలను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చారు.

హైదరాబాదుి ఎల్బీినగర్‌లో టిడిపి అభ్యర్థి ఆర్ కృష్ణయ్య అనుచరులపై కాంగ్రెసు అభ్యర్థి సుధీర్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనపై కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుధీర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.

సూర్యాపేట దగ్ధమైన కారులో రూ. 2.5 కోట్ల రూపాయలు పట్టుబడిన సంఘటనలో విచారణ ప్రారంభమైంది. ఆ కారు మాజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కంపెనీ పేరు మీద రిజిష్టర్ అయినట్లు తెలుస్తోంది. డ్రైవర్ పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు.

హైదరాబాదులోని అంబర్‌పేట కాంగ్రెసు అభ్యర్థి వి. హనుమంతరావు బిజెపి కార్యకర్తపై చేయి చేసుకున్నారు.

తెలంగాణవ్యాప్తంగా మధ్యాహ్నం ఒంటి గంట వరకు 49 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ చెప్పారు. సూర్యాపేట వద్ద తగలడిన కారులో రూ.2.5 కోట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు.

సైకిల్ గుర్తుకు ఓటేయలేనందుకు బాధగా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. దేశ ప్రయోజనం కోసమే బిజెపితో పొత్తు పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. బిజెపి, టిడిపి పొత్తు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.

టిడిపి నేత దుర్గాదాస్‌పై దాడి చేశారనే ఆరోపణపై మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్‌పై హైదరాబాద్‌లోని అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణిలతో కలిసి వచ్చి గాయత్రీ హిల్స్‌లో ఓటేశారు. క్యూలో నిలబడి వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఉదయం 11 గంటలకు తెలంగాణలో 11.5 శాతం పోలింగ్ జరిగింది. హైదరాబాద్‌లో 18.5 శాతం పోలింగ్ నమోదైంది.

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మల్కాజిగిరి లోకసభ అభ్యర్థి దినేష్ రెడ్డి తన అనుచరులతో రామంతపూర్‌లోని పోలింగ్ బూతులోకి ప్రవేశించారు. మాజీ డిజిపి కావడంతో పోలీసులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

సూర్యాపేటలో ఇన్నోవా కారులో మంటలు లేచాయి. ఇన్నోనా ఇంజిన్‌వో దాదాపు రూ.20 లక్షలు దగ్ధమయ్యాయి. కారుపై హుజార్‌నగర్ కాంగ్రెసు అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్టిక్కర్ ఉంది.

ఐఎఎస్ అధికారి రాధ, ఆయన కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యాయి. దీంతో నోటీసు ఇవ్వకుండా ఓట్లు ఎలా తొలగిస్తారంటూ వారు ఆందోళన వ్యక్తం చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో కాంగ్రెసు, తెరాస కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. దాడిలో మాజీ సర్పంచ్ శ్రీదేవ్, రతన్ గౌడ్ గాయపడ్డారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు.

హైదరాబాద్‌లోని గౌలిగుడాలో మాజీ మంత్రి, కాంగ్రెసు అభ్యర్థి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ తెలుగుదేశం పార్టీ నేతపై దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. టిడిపి నేత దుర్గాదాస్‌పై ఆయన దాడి చేసినట్లు ఆరోపిస్తున్నారు. దీంతో టిడిపి కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు స్వగ్రామం చింతమడకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన సతీమణి కూడా ఓటేశారు.

వరంగల్ జిల్లా ఖిలాస్‌పూర్‌లో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వెబ్ కాస్టింగ్ ద్వారా ఓటింగు సరళిని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ పరిశీలిస్తున్నారు.

ఉదయం 9 గంటలకు తెలంగాణలో 15 శాతం ఓటింగు నమోదైంది. హైదరాబాద్‌లో ఓటు వేయడానికి ప్రజలు బద్దకిస్తున్నట్లు కనిపిస్తున్నారు. కేవలం 9 శాతం ఓటింగ్ మాత్రమే జరిగింది. మహబూబ్‌నగర్‌లో ఓటింగ్ జోరుగా సాగుతోంది. ఈ జిల్లాలో 17 శాతం ఓటింగ్ నమోదైంది. రంగారెడ్డి జిల్లాలో 12.5 శాతం నమోదైంది.

నందమూరి హీరో, తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ బిఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

శేర్‌లింగంపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గాంధీ సతీమణి ఓటు గల్లంతైంది.

హైదరాబాదులోని ఎర్రమంజలి పోలింగ్ బూత్‌లో లోకసత్తా నాయకుడు జయప్రకాష్ నారాయణ సతీసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాదులోని ఎంఎస్ మక్తాలో ఓటు వేసేందుకు గడువుకన్నా ముందే గవర్నర్ నరసింహన్ దంపతులు పోలింగ్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఆ ప్రాంతంలో సరైన రోడ్డు మార్గం లేదు. కొంత దూరం గవర్నర్ దంపతులు నడిచి వచ్చారు.

ఓటు వేయడానికి గవర్నర్ దంపతులు చాలా సేపు నిరీక్షించారు. గవర్నర్ రాకతో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 119 శానసభా స్థానాలకు 1669 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. 17 లోకసభ స్థానాలకు 265 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు.

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ దంపతులు హైదరాబాదులోని గాయత్రీ హిల్స్‌లోని ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్‌లో ఈవియంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.

సిద్ధిపేటలోని 9వ పోలింగ్ కేంద్రంలో తెరాస అభ్యర్థి హరీష్ రావు సిద్ధిపేటలోని 9వ పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. హైదరాబాదులోని మాసాబ్ ట్యాంకులోని పోలింగ్ బూత్‌లో డిజిపి ప్రసాద రావు ఓటేశారు.

Polling begins in ten districts of Telangana

చాలా చోట్ల ఈవిఎంలు మొరాయిస్తున్నాయి. పది జిల్లాల్లోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఉదయం పూటే బారులు తీరారు.

హైదరాబాద్‌లో పంజగుట్ట పోలింగ్ బూత్‌లో ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

హైదరాబాదులోని ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో నటుడు శివాజీ రాజా, యాంకర్ ఝాన్సీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ హైదరాబాదులోని గాయత్రీ హిల్స్ పోలింగ్ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సినీ నటుడు నాగార్జున తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కును అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నాగార్జునతో పాటు అమల కూడా ఓటు వేశారు.

గవర్నర్ నరసింహన్ దంపతులు, డిజిపి ప్రసాద రావు ఉదయం తన ఓటు హక్కును వినియోగుంచుకున్నారు.

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం దన్నారం గ్రామంలో ఎనిమిదిన్నర గంటల వరకు కూడా పోలింగ్ ప్రారంభం కాలేదు.

పలు ప్రాంతాల్లో ఓటర్లు ఆందోళన చేశారు. ఓటర్ లిస్టులో తమ పేరు లేదని వారు నిరసన తెలిపారు.

కుటుంబ సమేతంగా వచ్చి చిరంజీవి ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిరు, రామ్ చరణ్‌లు జూబ్లీహిల్స్‌లో ఓటేశారు.

English summary
Polling has began in 10 districts of Telangana at 7 AM today. governor Narasimhan has franchised his voting right at MS Makta in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X