ప్లాంటును తరలిస్తారా?: పొంగులేటి, అధికారమివ్వాలని షబ్బీర్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలోని పవర్ ప్లాంటును నల్గొండ జిల్లాకు తరలించడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో 3200 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణానికి భూసేకరణ పూర్తయిందన్నారు.
ఈ సమయంలో ప్రాజెక్టును నల్గొండకు ఎలా తరలిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని 7 మండలాలు, విద్యుత్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చి అన్యాయం చేశారని అన్నారు.
తమ జిల్లాకు మంజూరైన విద్యుత్ ప్లాంటును కూడా నిర్మించకుండా ఇతర జిల్లాలకు తరలిస్తే ఖమ్మం జిల్లా మరింత నష్టపోతుందని అన్నారు. పవర్ ప్లాంట్ మరో జిల్లాకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర రావును ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి కోరారు.

రాజ్యాధికారం ఇవ్వండి: కెసిఆర్‌కు షబ్బీర్
ఎస్సీ, ఎస్టీలకు హైదరాబాద్‌లో భవనాలు నిర్మిస్తే బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందవని.. ఆ వర్గాలకు రాజ్యాధికారం ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఆ వర్గాలకు రాజ్యాధికారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 49శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇచ్చింది కేవలం మూడు మంత్రి పదవులేనని గుర్తు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రత్యేక పథకాలు రూపొందించాలని అన్నారు.












Click it and Unblock the Notifications