Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్‌కు ఒక్కసారి ఓటేస్తే.! ఆకాశమే హద్దు: చెప్పుతో కొట్టండని పోసాని ఆసక్తికరం

Recommended Video

    వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పై పోసాని ప్రశంసలు

    పశ్చిమగోదావరి: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిపై టాలీవుడ్ దర్శకుడు, నటుడు పోసాని కృష్ణమురళీ ప్రశంసల వర్షం కురిపించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైయస్‌ జగన్‌ను ఆయన శనివారం కలిశారు.

    ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. జగన్‌లోని నిజాయితీ, మాట మీద నిలబడే తత్వం తనకు నచ్చాయని చెప్పారు. 'జగన్‌లోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింది. అందుకే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాను' అని తెలిపారు.

     జగన్ పాదయాత్ర అసాధారణం

    జగన్ పాదయాత్ర అసాధారణం

    ‘అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే నాయకుడు వైయస్‌ జగన్‌. ఆయనలో సంకల్పం చూసి ఆశ్చర్యం వేసింది. ఇది చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర. మూడు వేల కిలోమీటర్లు నడవడం అంటే మామూలు విషయం కాదు. మండుటెండను సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఆయన చేస్తున్న పాదయాత్ర అసాధారణం' అని పోసాని వ్యాఖ్యానించారు.

    జగన్‌ని ముఖ్యమంత్రిని చేయండి

    జగన్‌ని ముఖ్యమంత్రిని చేయండి

    ‘సమస్యల పరిష్కారంపై నిబద్ధత కలిగిన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డికి ఓటువేసి ముఖ్యమంత్రిని చేయండి. నేను రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక్కసారి మీరు ఓటు వేస్తే మీరే మళ్లీ మళ్లీ ఆయనను గెలిపిస్తారు.' అని పోసాని కృష్ణమురళీ చెప్పారు.

    ఆకాశమే హద్దు

    ఆకాశమే హద్దు

    అంతేగాక, ‘వైయస్ జగన్ గురించి చెప్పాలంటే ఆకాశమే హద్దు. ప్రాక్టికల్ జగన్ పాదయాత్ర చూసిన తర్వాత వైయస్ జగనే రాష్ట్రానికి సీఎం కావాలనిపించింది. జగన్ అబద్దపు హామీలివ్వడం లేదు. కమిట్‌మెంట్ ఉన్న నాయకుడైన జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం బాగుపడుతుంది' అని పోసాని వ్యాఖ్యానించారు.

    చెప్పుతో కొట్టండి..

    చెప్పుతో కొట్టండి..

    ‘దైవసాక్షిగా.. నా కుటుంబ సాక్షిగా.. నా మీద ఒట్టు వేసుకుని చెబుతున్నా జగన్ చాలా మంచివాడు. టీడీపీ ప్రభుత్వంలో జరగని అన్ని వర్గాల పనులు వైయస్ జగన్ చేస్తాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను' అని పోసాని చెప్పారు. జగన్ అంతకుముందు ముఖ్యమంత్రుల కంటే చాలా సమర్ధంగా పనిచేస్తారని అన్నారు. లేకపోతే తనను చెప్పుతో కొట్టండి అని అన్నారు.

     చంద్రబాబు ఒక్కరే..

    చంద్రబాబు ఒక్కరే..

    ‘నాకు ఎటువంటి పదవులు వద్దు. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీచేయను. ఎమ్మెల్సీ, రాజ్యసభ పదవులను స్వీకరించను. అబద్దపు హామీలిచ్చి ప్రజలను మోసం చేయనని, అబద్దపు హామీలతో నేను అధికారంలోకి రానని జగన్ చెప్పిన మాటలు నచ్చాయి. రాష్ట్రానికి సేవ చేయగల నాయకుడు వైయస్ జగన్ మాత్రమే. వైయస్ జగన్ గురించి రాష్ట్ర ప్రజలెవరూ తప్పుగా అనుకోలేదు. చంద్రబాబు మాత్రమే ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు' అని పోసాని కృష్ణమురళీ.. జగన్‌కు మద్దతుగా వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శక్తి ఎంటో ఇప్పటి వరకు తెలియదని పోసాని అన్నారు. అయితే, పవన్ కంటే ముందునుంచే జగన్ రాజకీయాల్లో ఉన్నారని చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+