రకుల్ తమ్ముడికి పాజిటివ్.. చంచల్ గూడా జైలుకు నిందితులు!!
ఒకపక్క తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడికి తెలంగాణ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుంటే మరోపక్క డ్రగ్స్ తీసుకుంటూ చాలామంది పట్టుబడుతున్నారు. హైదరాబాద్ పోలీసులు అనేక డ్రగ్స్ రాకెట్స్ ను పట్టుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం గతంలో సంచలనం సృష్టించి ఎంతో మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైన విషయం తెలిసిందే. అయితే అప్పుడు ఆ కేసు నీరుగారిపోగా, తాజాగా మరో డ్రెస్ కేసు హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది.
డ్రగ్స్ కేసులో రెండు కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం
ఈ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అరెస్టు కావడం ఇప్పుడు సంచలనం సృష్టించింది. తాజాగా సైబరాబాద్ పోలీసులు చేపట్టిన తనిఖీలలో నార్సింగి లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో ఐదుగురు నైజీరియన్లతో పాటు పలువురు ప్రముఖులను అరెస్ట్ చేశారు. వీరు వద్ద నుంచి రెండు కోట్ల విలువైన 200 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్
ఈ డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ సింగ్ ను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో పట్టుబడిన నిందితులకు ఈరోజు పోలీసులు డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. మొత్తం నిన్న 13 మందిని అరెస్ట్ చేసి వారందరికీ టెస్టు నిర్వహించగా. ఆరుగురికి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది.
రకుల్ సోదరుడికి నోటీసులు
అమన్ ప్రీత్ కొకైన్ తీసుకున్నట్టు పాజిటివ్ రిపోర్ట్ రావడంతో ఎన్డిపిఎస్ ఆక్ట్ 27 ప్రకారం అమన్ పేరును ఏ సిక్స్ గా ఎఫ్ఐఆర్ లో చేర్చారు. రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ సింగ్ కు నోటీసులు ఇచ్చి పోలీసులు పంపించారు. తరువాత అతనిని విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఒకవేళ విచారణ సమయంలో రకుల్ ప్రీత్ సోదరుడి పాత్రను బట్టి అరెస్టు చేసే అవకాశం కూడా లేకపోలేదు.
నిందితులకు రిమాండ్.. చంచల్ గూడా జైలుకు తరలింపు
ఇక ఈ డ్రగ్స్ కేసులో వైద్య పరీక్షలు పూర్తి చేసిన నార్సింగి పోలీసులు ప్రధాన నిందితులైన ఐదుగురిని కోర్టులో హాజరుపరచగా కోర్టు అయిదుగురు నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఐదుగురిని చంచల్ గూడా జైలుకు తరలించారు. ఈ కేసులో పోలీసులు గట్టిగానే ఫోకస్ చేసినట్టు సమాచారం.
ప్రధాన నిందితులు వీరే
నార్సింగి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ప్రధాన నిందితులలో అనూప్ బెస్లింగ్ అనే నైజీరియన్ మహిళతోపాటు, అజీజ్ ఆనమ్ అనే మరో నైజీరియన్, బెంగళూరుకు చెందిన అల్లం సత్యం వెంకట గౌతమ్, ఏపీకి చెందిన సానబోయిన వరుణ్ కుమార్, తెలంగాణకు చెందిన అహ్మద్ మహబూబ్ షరీఫ్ ను చంచల్ గూడా జైలుకు తరలించారు.












Click it and Unblock the Notifications