Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'పవర్' అలజడి: ఎపి రద్దు అందుకేనా, టి ఏం చేస్తుంది?

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పవర్ పాలిట్రిక్స్ సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జెన్‌కోకు సంబంధించి 'ఎక్కడి ప్రాజెక్టు విద్యుత్ అక్కడే' ప్రాతిపదికన ఉభయ రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలకు ముందడుగు వేసింది. ఇందులో భాగంగా విద్యుత్ పంపిణీ సంస్థలతో గతంలో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఏ) రద్దు చేసుకోవాల్సిందిగా ఎపిజెన్‌కోను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది.

దీనిపై ఎపిజెన్‌కో మంగళవారం విద్యుత్ నియంత్రణ మండలికి లేఖ రాసింది. పిపిఏలు రద్దయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కం) మళ్లీ తమ తమ రాష్ట్రాల్లోని జెన్‌కో ప్రాజెక్టులతో కొత్తగా కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల థర్మల్ విద్యుత్‌లో సుమారు 462 మెగావాట్ల వరకు ఎపికి అందాబుటు పెరగవచ్చు. అదే సమయంలో అంతమొత్తం తెలంగాణ రాష్ట్రం కోల్పోతుంది.

Power advisory issued to Telangana, Andhra Pradesh

రద్దు అందుకేనా!?

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను పరిగణలోకి తీసుకొని తెలంగాణలోని డిస్కంలకు 53.89, ఆంధ్రప్రదేశ్‌లోని డిస్కంలకు 46.11 శాతం విద్యుత్‌ను కేటాయిస్తు ఈ ఏడాది మేలో ఉత్తర్వు జారీ అయింది. ఈ ఉత్తర్వు ఆయా రాష్ట్రాల వినియోగం ఆధారంగా వెలువడింది. ఈ నేపథ్యంలో వినియోగం ఆధారంగా ఉత్తర్వులు వెలువడటం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని భావించిన ఎపి ప్రభుత్వం రద్దు దిశగా చర్యలు తీసుకుంది.

ఇటీవల విశాఖలో జరిగిన మంత్రివర్గ సమావేశంలోను కొందరు మంత్రులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి నుండి బయటపడటంపై ఎపి ప్రభుత్వం తర్జన భర్జన పడింది. ఇందుకు పిపిఏల రద్దే మార్గమని భావించినట్లుగా తెలుస్తోంది. పిపిఏల రద్దు ద్వారా ఎపిలో ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల విద్యుత్ తమకే వస్తుందని భావించి ఆ మేరకు జెన్‌కోను ఆదేశించిందని అంటున్నారు. దీంతో వినియోగం ఆధారంగా మేలో వచ్చిన జీవోకు చెల్లుచీటీ ఇవ్వనున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలో... ఎపి విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ చెల్లించే అంశానికి కౌంటర్‌గా కూడా చేయవచ్చునని అంటున్నారు.

తెలంగాణ నేతల గుర్రు

ఎపి ప్రభుత్వం పిపిఏల రద్దును చేయడాన్ని తెలంగాణ రాష్ట్ర నేతలు మండిపడుతున్నారు. పార్టీలకతీతంగా అన్ని పార్టీల వారు దీనిపై ధ్వజమెత్తుతున్నారు. పిపిఏల రద్దు అన్యాయమని, విభజన అంశాలపై ఇరు రాష్ట్రాల సామరస్య పూర్వకంగా వ్యవహరించాలని టిపిసిసి అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య సూచించారు. తెలంగాణ కాంగ్రెసు శాసన సభా పక్ష నేత జానా రెడ్డి కూడా దీనిని ఖండించారు. ఇక తెలంగాణ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న మీకు విద్యుత్ అవసరం లేదా అని ప్రశ్నించారు.

టి ప్రభుత్వం అలా చేస్తుందా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకపక్షంగా పిపిఏలను రద్దు చేస్తోందని, దీనిని తాము సాగనివ్వమని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరిస్తోంది. దానిని అమలు కానివ్వమన్నారు. ఒకవేళ ఎపి ప్రభుత్వం మొండిగా వెళ్తే వాళ్లు ఒకటి చేస్తే తాము నాలుగు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎపి అసెంబ్లీకి, ఎపి మంత్రులకు, ఎపి సచివాలయానికి విద్యుత్ అవసరం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఎపి ప్రభుత్వం అలాగే మొండిగా వ్యవహరిస్తే హైదరాబాదులోని ఎపి కార్యాలయాలు, మంత్రుల ఇళ్లు, అసెంబ్లీకి విద్యుత్ ఆపివేసే అంశంపై పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+