ప్రభాస్ సునామీకి గడువు 24 గంటలే!
ఎటువంటి సినిమాలు లేక, విడుదలైన సినిమాలు విజయవంతం కాక బాక్సాఫీస్ కు ఎక్కడలేని నీరసం వచ్చింది. అటువంటి బాక్సాఫీస్ కు ఆదిపురుష్ మంచి ఉత్సహాన్ని కల్పిస్తున్నాడు. ఊహించినదానికన్నా ఆదిపురుష్ టికెట్లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. దీనిపై ట్రేడ్ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభాస్ కు ఉన్న ఇమేజ్ తోపాటు శ్రీరాముడి సెంటిమెంట్ కలిసివస్తుందని భావిస్తున్నారు. అనుకున్నదానికన్నా వంద రెట్లు ఎక్కువగా ఉందని, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో టికెట్ల అమ్మకానికి సంబంధించి కొత్త రికార్డులు బద్ధలవుతున్నాయి. ఒక్క భాగ్యనగరంలోనే 400 కు పైగా స్క్రీన్లు పడబోతున్నాయి. వీకెండ్ మొత్తం అలాగే ఉండబోతోంది.
ఉత్తర భారతదేశానికి చెందిన ప్రేక్షకులు మాత్రం ఆదిపురుష్ పై విపరీతమైన ఎగ్జైట్ మెంట్ ను కనపరుస్తున్నారు. టాక్ కొంచెం పాజిటివ్ గా వచ్చినా పఠాన్, ఆర్ ఆర్ ఆర్, కేజీఎఫ్ 2 రికార్డులు బద్ధలవడం ఖాయమంటున్నారు. తెలంగాణలో తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే బెనిఫిట్ షోలు వేయబోతున్నారు. ఏపీలో బెనిఫిట్ షోలు వేస్తారా? లేదా? అనేది స్పష్టత లేదు. దాదాపు కొన్ని నెలల తర్వాత సినిమా టికెట్ల కోసం తమ ఫోన్లు నాన్ స్టాప్ గా మోగుతున్నాయని డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ యజమానులైతే ఎవరి ఫోన్ కాల్స్ కు అందుబాటులో లేరు.

ఈ సినిమా ఎలా ఉండబోతోంది? సూపర్ హిట్టా? హిట్టా? యావరేజా? అన్నదానిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ సినిమాకు విడులకు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తుండటంతో ఫలితం కూడా తాము ఆశించినట్లే ఉండబోతోందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది. దర్శకుడు ఓం రౌత్, ప్రభాస్ మ్యాజిక్ చేసివుంటారని, కచ్చితంగా సినిమా రికార్డులు నెలకొల్పుతుందంటూ ప్రభాస్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

ఓపెనింగ్ కు గతంలో ఏ సినిమాకు లేనటువంటి రీతిలో ఆదిపురుష్ మేనియా కొనసాగుతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ అన్నీ జై శ్రీరామ్ నినాదాలతో శుక్రవారం మోగబో ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్ వగైరా సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అన్నీ జై శ్రీరామ్ నినాదంతో మారుమ్రోగిపోవడం ఖాయమనిపిస్తోంది.












Click it and Unblock the Notifications