పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం
పిఠాపురం.. ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసిన ఈ నియోజకవర్గం గురించే చర్చ సాగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దీంతో పిఠాపురం నియోజకవర్గం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కల్యాణ్ ..వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు.
కూటమి తన గెలుపుకు కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ లెక్కలు వేసుకుంటున్నారు. పిఠాపురంలో టీడీపీ నేతలతో కలిసి పవన్ కల్యాణ్ విసృతంగా ప్రచారం నిర్వహించారు. ఇప్పటికే జబర్దస్త్ నటులు, మెగాస్టార్ చిరంజీవి, నేచురల్ స్టార్ నాని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన మద్దతు తెలుపుతూ వీడియోలు, పోస్ట్‌లు రిలీజ్ చేశారు. తేజా సజ్జా, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు సైతం పవన్ కల్యాణ్‌కు తమ మద్దతు తెలిపారు.

నిర్మాత నాగవంశీ కూడా పవన్‌కు సపోర్ట్ చేశారు. అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల వంటి స్టార్స్ కూడా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా ట్వీట్స్ చేశారు. తాజాగా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా స్టార్ హీరో ప్రభాస్ పెద్దమ్మ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఆమె మాట్లాడుతూ.. పిఠాపురంలో అత్యధిక మెజారిటీతో మన పవన్ కల్యాణ్ గెలుపు ఖాయం అయిపోయింది.
చాలా మంది అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు పవన్ కల్యాణ్ ఘన విజయం సాధిస్తాడు. పిఠాపురం ప్రజలందరూ కూడా ఎంత మెజారిటీ ఇస్తారో అది రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజారిటీ అవుతుంది. పవన్ కల్యాణ్‌కు వస్తుందని నేను ఆశిస్తున్నాను. అది 100 శాతం జరుగుతుంది. జై మోడీ, జై తెలుగుదేశం, జై జనసేన అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications