RGV cheers: రాంగోపాల్ వర్మను 9 గంటలపాటు ప్రశ్నించిన పోలీసులు, ఇక సీఐడీ
ప్రకాశం: ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌పై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేయడంతోపాటు ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న రాంగోపాల్ వర్మను సీఐ శ్రీకాంత్ బాబు 9 గంటలపాటు విచారించారు.
చంద్రబాబు, లోకేష్, పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసి, మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడానికి కారణమేంటని ఆర్జీవీని పోలీసులు ప్రశ్నించారు. దీని వెనుక ఎవరున్నారు? ఎవరు సహకరించారు? వంటి ప్రశ్నలు సంధించారు. అయితే, తన సినిమా ప్రచారంలో భాగంగానే తాను అలా చేసినట్లు రాంగోపాల్ వర్మ అంగీకరించినట్లు సమాచారం.

వ్యూహం సినిమా ఫైబర్ నెట్‌లో ప్రసారం అనంతరం దాదాపు రూ. 2 కోట్లు రాయల్టీ పొందడంపై కూడా ఆర్జీవీని ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే, ఈ ప్రశ్నకు ఆర్జీవీ ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. వైసీపీ నేతలతో తనకు వ్యక్తిగత సంబంధాలే ఉన్నాయని చెప్పినట్లు తెలిసింది.
Ram Gopal Varma appeared before the #Ongole police for questioning on Offensive Social Media Posts against CM #ChandrababuNaidu, Dy CM #PawanKalyan and Minister #NaraLokesh
— Surya Reddy (@jsuryareddy) February 7, 2025
Several cases were registered against Film Maker #RamGopalVarma (#RGV) in #AndhraPradesh last year,… pic.twitter.com/5jx4VM93Fc
కాగా, ప్రకాశం పోలీసుల సుదీర్ఘ విచారణ అనంతరం రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో సంచలన పోస్టు పెట్టారు. వైన్ గ్లాసుతో 'ఐ లవ్ ఒంగోలు, ఐ లవ్ ఒంగోలు పోలీస్ ఈవెన్ మోర్.. చీర్స్' అంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. దీనికి స్మైలీ, మందు గ్లాసుల ఎమోజీలను జత చేశారు రాంగోపాల్ వర్మ.
మరోవైపు, ఒంగులో వచ్చిన ఆర్జీవీకి సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఫిబ్రవరి 10న గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. కులాలను రెచ్చగొట్టే విధంగా ఆర్జీవీ పోస్టులు పెట్టారని, ఆయన వల్ల తమ మనోభావాలు దెబ్బతిన్నాయని తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ ఫిర్యాదు మేరకు గత నవంబర్ 29న సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ క్రమంలో పోలీసులు రాంగోపాల్ వర్మకు తాజాగా నోటీసులు ఇచ్చారు.












Click it and Unblock the Notifications