పోలవరంపై ఏపీకి ఝలక్: రామ్మోహన్‌నాయుడుకు జవదేకర్ సమాధానం
న్యూఢిల్లీ: పోలవరంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును నీటితో నింపేందుకు కేంద్రం సమ్మతించలేదని తెలిపారు.
పొరుగు రాష్ట్రాలైన ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్‌లతో తలెత్తిన వివాదాలు ముగిసే వరకూ పోలవరం జలాశయాన్ని నింపొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించామని కేంద్రమంత్రి జవదేకర్ చెప్పారు.

లోకసభలో తెలుగుదేశం పార్లమెంటు సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు. పోలవరం నిర్మాణంపై విధించిన నిలుపుదల ఉత్తర్వులను శాశ్వతంగా ఎత్తివేయాలని ఏపీ ప్రభుత్వం తమను కోరిందని చెప్పారు.
గత జూన్‌లో కొన్ని నిబంధనలతో ఏడాదిపాటు నిర్మాణాన్ని కొనసాగించేందుకు అనుమతించామని కేంద్రమంత్రి జవదేకర్ తెలిపారు. కాగా, ఇటీవల కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం కేంద్రమే నిధులను మంజూరు చేస్తుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications