పవన్ కళ్యాణ్ కు ఎలివేషన్ ? ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్..!
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది. కూటమిలో మూడు పార్టీలు ప్రస్తుతానికి ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకెళ్తున్నాయి. ఇదే పరిస్ధితి కొనసాగితే ఐదేళ్ల పాటు ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదు. అయితే తాజాగా ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో పాటు కేంద్రం తెస్తున్న కొత్త బిల్లు రాష్ట్రంలో ఏం జరుగుతుందనే చర్చకు తావిస్తున్నాయి. ముఖ్యంగా అంతుబట్టని బీజేపీ వ్యూహాల్ని మరోసారి జనంలో చర్చకు తెస్తున్నాయి.
క్రిమినల్ కేసుల్లో అరెస్టు అయి జైలు పాలైన మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాని అయినా నెల రోజుల పాటు జైల్లో ఉంటే ఆటో మేటిగ్గా పదవులు కోల్పోయేలా కేంద్రం కొత్త చట్టాన్ని తెస్తోంది. ఇప్పటికే లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం జేపీసీకి పంపింది. అక్కడి నుంచి రాగానే తిరిగి సవరణలతో ఆమోదించేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే ఈ బిల్లు వెనుక ఉన్న ఉద్దేశాలపై నటుడు ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ చేశారు.

ఒక చిలిపి సందేహం అంటూ ట్వీట్ ప్రారంభించిన ప్రకాష్ రాజ్.. మహాప్రభు .. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక , మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, "మీ మాట వినే ఉపముఖ్యమంత్రిని ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా ? అని ప్రశ్నించారు. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని వేరే చెప్పాల్సిన పని లేదు.
ఒక చిలిపి సందేహం
— Prakash Raj (@prakashraaj) August 22, 2025
మహాప్రభు .. తమరు కొత్తగా ప్రవేశపెడుతున్న బిల్లు వెనుక , మాజీ ముఖ్యమంత్రి కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి కానీ తమ మాట వినకపోతే అరెస్టు చేసి, “మీ మాట వినె ఉపముఖ్యమంత్రిని” ముఖ్యమంత్రి చేసే కుట్ర ఏమైనా ఉందా ??? #justasking #newbill #parliament pic.twitter.com/3sbPGazzGj

రాష్ట్రంలో బీజేపీతో కలిసి జనసేన ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్ధితి లేకపోవడంతో గత ఎన్నికల్లో టీడీపీతో వీరిద్దరూ జట్టు కట్టారు. అయితే ఎప్పటికైనా జనసేన-బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనేది కాషాయ పెద్దల వ్యూహంగా ఉంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో తెస్తున్న తాజా బిల్లు ద్వారా ఈ వ్యూహం నెరవేర్చుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందా అని ప్రకాష్ రాజ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
పవన్ ఉగ్రరూపం: ఎమ్మెల్యేలకు లాస్ట్ వార్నింగ్, ఇక యాక్షన్ తప్పదు -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications