లోకేష్ తో ప్రశాంత్ కిషోర్; చంద్రబాబుతో భేటీ: మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ సెటైర్!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో అత్యంత ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టిడిపి యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్ నుంచి ఒకే విమానంలో విజయవాడకు రావడం, అలాగే ఒకే వాహనంలో వారు ఇరువురు ఉండవల్లి లోని చంద్రబాబు నివాసానికి వెళ్లి, చంద్రబాబుతో భేటీ అవ్వడం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలలోను, రాజకీయ వర్గాలలోను ఆసక్తికర చర్చకు కారణంగా మారింది.

టీడీపీ తమ పార్టీకి వ్యూహకర్తగా పని చేయకున్నా, ప్రశాంత్ కిషోర్ కనీసం రాజకీయ సలహాదారుగా అయినా ఉండాలని కోరింది.ఈ క్రమంలో ఒకసారి చంద్రబాబుతో సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్ తాడేపల్లి చంద్రబాబు నివాసానికి చేరుకొని చంద్రబాబుతో చర్చలు జరిపారు.

Prashant Kishor and Lokesh Meeting with Chandrababu: Ambati Rambabu shocking satire!!

ప్రశాంత్ కిషోర్ గతంలో జగన్ తో పని చేసిన క్రమంలో ఇప్పుడు చంద్రబాబుకు పని చేస్తే, జగన్ బలాలు, బలహీనతలు తెలిసిన వ్యక్తి కాబట్టి, తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు చంద్రబాబు కోసం ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొంది.

ఇక తాజా పరిణామాలపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. లోకేష్ తో ప్రశాంత్ కిషోర్ అంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు షాకింగ్ సెటైర్ వేశారు. మెటీరియలే మంచిది కాకపోతే మేస్త్రి ఏమి చేయగలడు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అసలు తెలుగుదేశం పార్టీ అనే మెటీరియల్ నే మంచిది కాదని, అలాంటప్పుడు అటువంటి తెలుగుదేశం పార్టీతో ప్రశాంత్ కిషోర్ ఏం చేయగలుగుతాడు అని అంబటి రాంబాబు విమర్శస్త్రాన్ని ఎక్కుపెట్టారు. ఇక నిన్నటికి నిన్న పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కోసం, చంద్రబాబు నాయుడు పుత్రుడు కోసం పనిచేస్తున్నారని, కానీ ఒకే ఒక్కడు జగన్ మోహన్ రెడ్డి ప్రజల కోసం పనిచేస్తున్నాడని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+