వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌పై అభిమానం: సర్వేపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు, రోజాకు నెగిటివ్ రిపోర్ట్‌పై..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సాయంత్రం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా పాల్గొన్నారు.

చదవండి: జగన్ భేటీలో ప్రశాంత్ కిషోర్, 'లోకేష్ సేల్స్ మేనేజర్‌గా వెళ్లాలని..

ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఇటీవల తన పేరిట జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఈ భేటీలో కొట్టి పారేశారు. అంతేకాదు, తాజా రాజకీయ పరిణామాలతో పాటు 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని కూడా నేతలకు చెప్పారు.

జగన్‌పై అభిమానంతోనే వైసిపికి పని చేస్తున్నా

జగన్‌పై అభిమానంతోనే వైసిపికి పని చేస్తున్నా

వైసిపికి ఎన్నికల వ్యూహకర్తగా పని చేస్తున్నందుకు ప్రశాంత్ కిషోర్ పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. దీనిపై ఆయన అప్పుడే ఖండించారు. తాజా భేటీలోను ఆయన మాట్లాడారు. తాను గతంలో ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌లకు పని చేశానని, వారిపై అభిమానంతో పని చేశానని చెప్పాుర. ఇప్పుడు జగన్‌పై అభిమానంతో తాను పని చేస్తున్నానని చెప్పారు.

అంతా అబద్దం.. ఏ సర్వే చేయలేదని కిషోర్

అంతా అబద్దం.. ఏ సర్వే చేయలేదని కిషోర్

వైసిపి కోసం పని చేసేందుకు సిద్ధమైన ప్రశాంత్ కిషోర్ కొద్ది రోజుల క్రితం సర్వే చేశారని, అందులో టిడిపి - బిజెపి కూటమి గెలుస్తుందని, వైసిపి ఓడిపోతుందని, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన ప్రభావం ఉండదని ఆయన సర్వేలో తేలినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ భేటీలో ఈ వార్తలను ఆయన కొట్టి పారేశారు. తాను వైసిపి తరఫున ఏ సర్వేలు చేయలేదని నేతలకు స్పష్టం చేశారు. తన పేరిట వచ్చిన సర్వేలు అవాస్తవమని చెప్పారు.

రోజాకు వ్యతిరేకంగా రిపోర్టుపై..

రోజాకు వ్యతిరేకంగా రిపోర్టుపై..

తాను ఏ సర్వేలు చేయలేదని చెప్పిన ప్రశాంత్ కిషోర్... పార్టీ ఎమ్మెల్యే రోజాపై అధినేత జగన్‌కు తాను వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చినట్లు వచ్చిన వార్తలను కూడా ఈ భేటీలో కొట్టి పారేశారని తెలుస్తోంది. రోజా తీరుపై ప్రశాంత్ కిషోర్ వ్యతిరేక నివేదిక ఇచ్చారని, దీంతో జగన్ ఆమెకు క్లాస్ పీకారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని కూడా ఆయన కొట్టి పారేశారని తెలుస్తోంది.

టిక్కెట్ల కేటాయింపు నాకు సంబంధం లేదు

టిక్కెట్ల కేటాయింపు నాకు సంబంధం లేదు

తాను పార్టీ గెలుపు కోసం పని చేస్తానని, పార్టీ టిక్కెట్ల కేటాయింపు తనకు ఏమాత్రం సంబంధం లేదని ప్రశాంత్ కిషోర్ ఈ భేటీలో చెప్పారని తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలని జనంలోకి తీసుకు వెళ్లాలని ఆయన సూచించారు. పార్టీ నేతలు అందరు కలిసి పని చేయాలన్నారు. నేతలు అందరూ పని తీరును మెరుగుపరుచుకోవాలని సూచించారు. తాజా రాజకీయ పరిణామాలను గమనిస్తూనే, 2019 ఎన్నికల్లో గెలుపు కోసం ముందుకు నడవాలని ఆయన సూచించారు.

English summary
Prashant Kishore says he is working for YSRCP due to affection with YS Jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X