జగన్‌ను మించినవారున్నారా? సాక్షి మీడియాపై పత్తిపాటి, నారాయణ ఫైర్

విజయవాడ: తమ ప్రభుత్వంపై బురద జల్లేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, సాక్షి మీడియా ప్రయత్నిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్‌ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌ పదేళ్లలో 5లక్షల ఎకరాలకు పైగా కాజేశాడని... 12 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని పత్తిపాటి తెలిపారు. బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టుకోవడం ఆయనకే తెలిసిన విద్య అని ఆరోపించారు.

ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తున్న సాక్షి ప్రమోటర్స్‌, ఎండీ, ఎడిటర్‌, విలేకరిపై సివిల్‌, క్రిమినల్‌ పరువునష్టం దావా వేయనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

అవినీతిపరులకు ఎదుటివారు దొంగలుగా, అవినీతిపరులుగా కనిపిస్తారని మండిపడ్డారు. బినామీల పితామహుడు జగన్ అని వ్యాఖ్యానించారు. పత్రిక, ఛానల్ చేతిలో ఉందని అవాస్తవాలు ప్రచురింవద్దని సూచించారు. పత్రికలు ఉన్నది వాస్తవాలను ప్రజలకు తెలియజేయటానికే తప్ప ప్రజల హక్కులను కాలరాయడానికి కాదన్నారు.

Prathipati and Narayana fires at YS Jagan

అతి తక్కువ కాలంలో...ఎక్కువ సంపాదించి ప్రపంచ రికార్డుకెక్కిన నాయకుడు జగన్ అని ఎద్దేవా చేశారు. సాక్షిలో తప్పుడు కథనాలపై జగన్ జైలుకెళ్లక తప్పదని మంత్రి ప్రత్తిపాటి హెచ్చరించారు. సాక్షి అవాస్తవాలను విషంలా చిమ్ముతోందన్నారు. జగన్‌ జైలుకెళ్తారనే భయంతో ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారని మంత్రి చెప్పారు.

జగన్‌ పద్ధతి మార్చుకోకుంటే వైయస్సార్ కాంగ్రెస్‌లో ఆయన ఒక్కరే మిగులుతారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. తాము అవినీతి సంపాదనతో కొన్న భూములు ఎక్కడున్నాయో వైయస్సార్ కాంగ్రె నేతలు చెబితే వాటిని పేదలకు పంపిణీ చేసేస్తామని మరో మంత్రి నారాయణ సవాల్‌ చేశారు.

తనకు వ్యాపారాలున్నాయని.. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాననని మంత్రి నారాయణ తెలిపారు. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని నారాయణ చెప్పారు.

గవర్నర్ ప్రసంగం, ఉచిత ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం

గవర్నర్ ప్రసంగం, ఉచిత ఇసుక విధానానికి బుధవారం జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. పూర్తిస్థాయిలో ఇసుక ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నెలరోజులపాటు కేబినెట్‌లో ఈ విధానం అమలు, విధివిధానాలు తెలియజేయనున్నట్లు మంత్రి పుల్లారావు తెలిపారు.

ఈ విధానంలో అక్రమాలకు పాల్పడితే పీడీ కేసులు పెడతామని హెచ్చరించారు. దుర్వినియోగం కాకుండా టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హార్టకల్చర్ పేరు మార్పు అంశం వచ్చే కేబినెట్ సమావేశానికి వాయిదా వేసినట్లు చెప్పారు.

నూతన రాజధాని నిర్మాణానికి భారీ విరాళం

నూతన రాజధాని నిర్మాణానికి రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ ఉద్యోగులు ఒక రోజు వేతనం రూ.29.5లక్షలను సీఎం చంద్రబాబుకు బుధవారం అందజేశారని సంస్థ జేఏసీ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ ఛైర్మన్‌ వర్ల రామయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+