హత్యా రాజకీయాలు: జగన్‌పై పుల్లారావు, ధూళిపాళ్ల ఫైర్

Prattipati and Dhulipalla fires at YS Jagan
గుంటూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి ప్రత్తిపాటు పుల్లారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన గుంటూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జగన్ హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.

ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని జగన్ హత్యా రాజకీయాలతో రాష్ట్రంలో అలజడి రేపేందుకు ప్రయత్నిస్తున్నారని పుల్లారావు మండిపడ్డారు. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో తెలుగుదేశం నేత సింగారెడ్డి వెంకట్రామి రెడ్డిని వేటకొడవళ్లతో నరికి చంపడం దారుణమని అన్నారు.

టిడిపి విజయంలో వెంకట్రామిరెడ్డి కీలక పాత్ర పోషించారనే కక్షతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన్ని హత్య చేశారని అన్నారు. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ.. ఇటీవల కృష్ణా జిల్లాలో ముఠా కక్షల్లో మృతి చెందిన వ్యక్తి మరణాన్ని టిడిపిక ఆపాదించి లబ్ధి పొందేందుకు జగన్ ప్రయత్నించారని విమర్శించారు.

వైయస్ జగన్ కుటుంబం అంతా నేరమయమని పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఆరోపించారు.
మీడియా సమావేశంలో మంత్రి పుల్లారావు వెంట ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+