చంద్రబాబు ప్రమాణ స్వీకారం అప్పుడే

Chandrababu Naidu: ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రమాణ స్వీకార ఏర్పాట్లు.. విజయవాడలో చురుగ్గా సాగుతున్నాయి. గన్నవరం సమీపంలోని కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద ఈ కార్యక్రమం ఏర్పాటు కానుంది. గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్.. ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయబోతోండటం ఇది రెండోసారి. మొత్తంగా నాలుగోసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు, రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా 2014లో ప్రమాణ స్వీకారం చేశారాయన. ఇప్పుడు మళ్లీ ఈ పదవిని అందుకోబోనున్నారు.

Preparations gears up for swearing-in ceremony of the new CM Chandrababu Naidu

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి 164 స్థానాలను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇందులో టీడీపీ- 134, జనసేన- 21, బీజేపీ- 8 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 88 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం.

ఒకట్రెండు రోజుల్లో తెలుగుదేశం శాసనసభా పక్షం సమావేశం కానుంది. చంద్రబాబును తమ నాయకుడిగా ఎన్నుకుంటుంది. తనకు మద్దతు ఇచ్చే శాసన సభ్యుల సంతకాలతో కూడిన లేఖను ఆయన గవర్నర్‌కు అందజేస్తారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాల్సిందిగా కోరుతారు. ఈ నెల 12వ తేదీన చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ప్రమాణ స్వీకారం కోసం కేసరాపల్లి ఐటీ పార్క్ వద్ద గల ఖాళీ స్థలాన్ని ఎంచుకున్నారు. ప్రస్తుతం అక్కడ పనులు చురుగ్గా సాగుతున్నాయి. వేదిక నిర్మాణ సామాగ్రి చేరుకుంది. భూమిని చదును చేస్తోన్నారు సిబ్బంది. ప్రమాణ స్వీకార ఏర్పాటు పనులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్.. పరిశీలించారు. సిబ్బందికి సూచనలు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+