బాబుకు వెంకయ్య పరోక్ష సూచన: షాతో సుజనా
నెల్లూరు/ న్యూఢిల్లీ : మిత్రపక్షాల నేతలు బహిరంగంగా మాట్లాడడం సరి కాదని, సమస్యలు ఉంటే నేరుగా కేంద్రంతో మాట్లాడాలని బిజెపి సీనియర్ నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తప్పకుండా నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఆయన పరోక్షంగా సూచన చేశారనే మాట వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు తాను వెనక్కి తగ్గనని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారతి ట్రస్టులో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం కృషి చేస్తానన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో 36 ఏళ్లుగా జాప్యం జరిగిందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు ప్రత్యేక కమిటీని నియమిస్తామని కేంద్రమంత్రి వెంకయ్య వివరించారు. కర్నాటక రాష్ట్రం నుంచి ఎంపీని అయ్యాను కాబట్టే కేంద్రమంత్రిని కాగలిగానని వెంకయ్య చెప్పారు.

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానికి వేయి కోట్ల రూపాయలు ఇచ్చామని ఆయన చెప్పారు. రాజధాని ప్రణాళిక రూపొందించిన తర్వాత నిధులు కేటాయిస్తామని అన్నారు. ఎపి అభివృద్ధికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా అని చట్టంలో ఎక్కడా పేర్కొనలేదని అన్నారు.
బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను కేంద్రమంత్రి సుజనాచౌదరి కలిసి ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేరేలా కృషి చేయాలని కోరారు. ఏపీకి రావాల్సిన లోటు బడ్జెట్ నిధులు, ప్రత్యేకహోదాపై రాజధానికి నిధులు కేటాయించాలని సుజనాచౌదరి కోరారు. పరిశ్రమలకు పన్ను రాయితీలు ఆలస్యం వల్ల జరిగే నష్టాన్ని అమిత్‌షాకు కేంద్రమంత్రి వివరించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, ఆందోళన చెందవద్దని అమిత్ షా హామీ ఇచ్చారని ఆయన చెప్పారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇక ఒక్క మిస్డ్ కాల్‌తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!!












Click it and Unblock the Notifications