ఎపికి చేస్తాం, శంకించొద్దు: వెంకయ్య, అమరావతికి పర్యావరణ క్లియరెన్స్
న్యూఢిల్లీ/ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల విషయంలో ఆందోళనలు అవసరం లేదని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు అన్నారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. 35 ఏళ్ల నుంచి పనులు చేయని కాంగ్రెసు నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రానికి ఇచ్చిన హామీలను ఒక్కొటొక్కటిగా నెరవేరుస్తూనే ఉన్నామని చెప్పారు. విభజన హామీలను అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని తప్పుపట్టారు. రాజధాని ప్రణాళిక సిద్ధం కాకముందే వేయి కోట్ల రూపాయలకు పైగా నిధులు ఇచ్చామని ఆయన చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించే సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని శంకించాల్సిన అవసరం లేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని వెంకయ్య నాయుడు చెప్పారు.
కాగా, అమరావతి నిర్మాణానికి ఉన్న పర్యావరణ అడ్డంకులు తొలగిపోయాయి. అమరావతి నిర్మాణానికి కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధానికి అవసరమైన అన్ని అనుమతులను మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ చెప్పారు.
అమరావతి నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని, ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపనకు రావొద్దని అంటున్న నేపథ్యంలో పర్యావరణ అనుమతులు మంజూరు కావడం విశేషం. రాజధాని నిర్మాణానికి అనుమతుల ప్రక్రియ పూర్తయించని జవదేకర్ చెప్పారు.












Click it and Unblock the Notifications