వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రఘురామకృష్ణంరాజు లేఖకు స్పందించిన స్పీకర్: భద్రత కల్పించాలని హోంశాఖకు సూచన..

|
Google Oneindia TeluguNews

వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనకు భద్రత కల్పించాలని స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయగా.. ఆయన స్పందించారు. ప్రాణహాని ఉంది అని, కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని రఘురామ లేఖలో కోరిన సంగతి తెలిసిందే. ఎంపీ రఘురామ భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ హోంశాఖను కోరారు. స్పీకర్ సూచనతో హోంశాఖ ఆయనకు భద్రతను కల్పించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నిరోజులగా రఘురామకృష్ణంరాజు వ్యవహారం అగ్గిరాజేస్తోంది. సొంత పార్టీ, సీఎం జగన్‌పై విమర్శలు చేయడంతో వైసీపీ నేతలు అతనిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రఘురామ తన భద్రత గురించి స్పీకర్‌కు లేఖ రాశారు.

హోంశాఖ వద్దకు

హోంశాఖ వద్దకు

భద్రత కల్పించాలని స్వయంగా ఎంపీ కోరడంతో హోంశాఖ భద్రత కల్పించనుంది. స్పీకర్ సూచనల మేరకు హోంశాఖ భద్రత ఇవ్వనుంది. ఇదివరకు కూడా హోంశాఖ ఇలా ప్రొటెక్షన్ ఇచ్చింది. తనకు భద్రత కల్పించాలని రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కోరగా.. హోంశాఖ జడ్ క్యాటగిరీ భద్రత ఏర్పాటు చేసింది. సీఆర్పీఎఫ్ లేదంటే సీఐఎస్ఎఫ్ జవాన్లతో సదరు ఎంపీలకు ప్రొటెక్షన్ ఇస్తుంటారు. ఇప్పుడు రఘరామకు కూడా అలానే ప్రొటెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.

ప్రధానికి కూడా లేఖ

ప్రధానికి కూడా లేఖ

స్పీకర్‌తోపాటు ప్రధాని మోడీకి కూడా రఘురామ లేఖ రాశారు. తన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తల నుంచి భద్రత ఇవ్వాలని కోరారు. తన ప్రాణాలకు ముప్పు ఉంది అని అందులో పేర్కొన్నారు. ప్రధానికి రెండుసార్లు లేఖ రాయగా.. స్పీకర్‌కు కూడా రఘురామ లేఖ రాశారు. ఎంపీ లెటర్‌పై ఓం బిర్లా స్పందించి.. తదుపరి చర్యలు తీసుకున్నారు.

Recommended Video

YS Jagan ఫోటో పెట్టుకుని మళ్లీ గెలవండి రా చూస్తాను - Raghu Rama Krishnam Raju
ఇదీ వివాదం

ఇదీ వివాదం

రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. దీనికితోడు ఆయన సీఎం జగన్‌పై విమర్శలు చేయడం, ప్రభుత్వ పథకాల తీరును తప్పుపట్టడంతో వైసీపీ నేతలు ముప్పేట దాడికి దిగారు. తొలుత ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఎంపీపై విరుచుకుపడ్డారు. జగన్ దయతోనే ఆయన ఎంపీ అయ్యారని.. పార్లమెంటరీ కమిటీ చైర్మన్ పదవీ వచ్చిందని పేర్కొన్నారు. మిగతా నేతలు కూడా ఆడపా దడపా కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు. దీనికి రఘురామ కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. మంత్రి రంగనాథరాజు, కారుమూరి నాగేశ్వరరావుపై కామెంట్లు చేయడంతో.. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా వైసీపీ నేతలు కూడా రఘురామపై ముప్పేట మాటల దాడి చేయడంతో.. తనకు భద్రత కల్పించాలని ప్రధాని, స్పీకర్‌కు ఆయన లేఖ రాశారు. దీంతో స్పీకర్ స్పందించారు.

English summary
protect to ysrcp mp raghurama krishnam raju, speaker om birla ask to home ministry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X