చంద్రబాబు పార్టీ వారికి పురంధేశ్వరి పరామర్శ(పిక్చర్స్)
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పైన మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ రాజంపేట లోకసభ అభ్యర్థి పురంధేశ్వరి మండిపడ్డారు.
గురువారం ఆమె కడప జిల్లా రాజంపేటలో గాయపడ్డ టిడిపి, బిజెపి కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెసు దాడులకు వెరవకుండా నిలబడిన టిడిపి, బిజెపి కార్యకర్తలకు ఆమె అభినందనలు తెలిపారు.
జగన్ పార్టీ అక్రమాలకు తెగబడిందన్నారు. ఎన్నికల్లో తమకు మద్దతుగా నిలబడిన కార్యకర్తలకు తాము అండగా ఉంటామన్నారు. తమకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

పురంధేశ్వరి
మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం కడప జిల్లా రాజంపేటలో గాయపడ్డ టిడిపి, బిజెపి కార్యకర్తలను పరామర్శించారు.

పురంధేశ్వరి
మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం కడప జిల్లా రాజంపేటలో గాయపడ్డ ఓ కార్యకర్తను వివరాలు అడుగుతున్న దృశ్యం.

పురంధేశ్వరి
మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గురువారం కడప జిల్లా రాజంపేటలో గాయపడ్డ కార్యకర్తలను పరామర్శించి వస్తున్న దృశ్యం.

పురంధేశ్వరి
మాజీ కేంద్రమంత్రి, భారతీయ జనతా పార్టీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజంపేట లోకసభకు పోటీ చేశారు. బుధవారం పోలింగ్ సమయంలో పలుచోట్ల టిడిపి, బిజెపి కూటమికి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ ఘర్షణలో పలువురు గాయపడ్డారు.












Click it and Unblock the Notifications