వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌ను టార్గెట్ చేయబోతే రివర్స్ అయిందా: పవన్ 'పదేపదే' తప్పు చేస్తున్నారా?

|
Google Oneindia TeluguNews

Recommended Video

పవన్ టార్గెట్ రివర్స్ అయిందా ?

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పదేపదే తనకు అధికార యావ లేదని, ప్రజల సంక్షేమం కోరుకుంటున్నానని చెప్పడం ద్వారా తప్పు చేస్తున్నారా? ఇప్పుడు రాజకీయ వర్గాల్లో, అభిమానులతో పాటు చాలామందిలో ఇది చర్చనీయాంశంగా మారింది.

పోలవరం: తెరపైకి కొత్త అంశం, కేంద్రం ఏంచెప్పినా బాబు ఓకే! 'పులివెందులకే ఇచ్చా'పోలవరం: తెరపైకి కొత్త అంశం, కేంద్రం ఏంచెప్పినా బాబు ఓకే! 'పులివెందులకే ఇచ్చా'

గత వారం పవన్ ఏపీలో నాలుగు రోజుల పాటు పర్యటించారు. విశాఖపట్నం, విజయవాడ, ఒంగోలు, పోలవరం ప్రాజెక్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పలుమార్లు తనకు అధికారం అవసరం లేదని చెప్పారు. అభిమానులు పదేపదే సీఎం.. సీఎం అంటుంటే కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు.

 జగన్‌కు ఇలా కౌంటర్ ఇచ్చారు

జగన్‌కు ఇలా కౌంటర్ ఇచ్చారు

తనకు కావాల్సింది అధికారం కాదని, ప్రజా సంక్షేమం అని, దాని కోసమే తాను పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ పదేపదే ప్రకటిస్తున్నారు. అంతేకాదు, ఈ పర్యటన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు అధికారం ముఖ్యం కాదని, అయినా తనకు అనుభవం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు, అధికారం ఉంటేనే ప్రజలకు ఏదైనా చేయవచ్చుననే అపోహ కూడా సరికాదన్నారు.

 అభిమానులకూ నిరాశే

అభిమానులకూ నిరాశే

పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఏ ఉద్దేశ్యంతో చేసినా ఇది సరైనది కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సీఎం అయ్యేందుకు తనకు అనుభవం లేదని చెప్పారు. తద్వారా 2019లో తాను ముఖ్యమంత్రి అభ్యర్థిని కాదని ఓ రకంగా తేల్చి చెప్పారు. అది అభిమానులకు కూడా నిరాశ కలిగించే విషయమే.

 జగన్‌కు కొట్టబోతే పవన్ కళ్యాణ్‌కు తగిలిందా

జగన్‌కు కొట్టబోతే పవన్ కళ్యాణ్‌కు తగిలిందా

తనకు రాజకీయ అనుభవం లేదని పవన్ కళ్యాణ్ వాస్తవంగా తనను తాను ఉద్దేశించే అనుకొని ఉంటారు. కానీ కొందరు దానిని వైసీపీ అధినేత జగన్‌కు ఆపాదిస్తున్నారు. జగన్‌కు కూడా అనుభవం లేదని చెప్పేందుకే ఆ వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. అయితే, సమస్యలు పరిష్కరించాలంటే సీఎం కావాల్సిన అవసరం లేదని మాత్రం జగన్‌ను ఉద్దేశించే మాట్లాడారు. పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడినా తనకు అధికారంపై మమకారం లేదని చెప్పడం మాత్రం సరికాదని అంటున్నారు.

 పార్టీ ఎక్కువ కాలం ఉండాలన్నా

పార్టీ ఎక్కువ కాలం ఉండాలన్నా

జగన్ విషయం పక్కన పెడితే, జనసేన విషయానికి వస్తే.. ఆ పార్టీ నిలదొక్కుకోవాలన్నా, నిజంగానే ప్రజలకు మంచి చేయాలని ఉంటే.. అది ఎక్కువ కాలం మనగలగాలన్నా అధికారం ఉండాలని అంటున్నారు. అధికారం వద్దని కేవలం ప్రజా సేవ కోసమే పార్టీ అంటే ఎక్కువ కాలం ఉండదని అంటున్నారు.

 పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారా?

పవన్ కళ్యాణ్ చేతులెత్తేశారా?

పవన్ కళ్యాణ్‌కు నిజంగానే ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉందని, కానీ అధికారం, పదవులు వద్దని చెబితే అది నష్టం చేకూరుస్తుందని అంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములు వేరు. కానీ అధికారం వద్దని చెప్పడం వేరు అని గుర్తు చేస్తున్నారు. పార్టీ ఉండాలంటే అధికారంపై ఇలాంటి వ్యాఖ్యలు సరికాదని అంటున్నారు. అయితే, పవన్ తనకు పదవులపై ఆసక్తి లేదని చెప్పారు తప్పితే, గెలిస్తే వద్దని చెప్పలేదని అంటున్నారు. కానీ తనకు అనుభవం లేదని చెప్పి ముందు తానే చేతులెత్తేశారని అంటున్నారు. ఈ వ్యాఖ్యలు వైసీపీకి ఆయుధాన్ని ఇచ్చినట్లే అంటున్నారు. చంద్రబాబుకు అనుకూలంగా ఉంటాడని చెప్పేందుకు ఇలాంటి వ్యాఖ్యలను వైసీపీ ఉపయోగించుకుంటుందని గుర్తు చేస్తున్నారు.

English summary
Jana Sena chief Pwan Kalyan asking for good governance in Andhra pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X