Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ కు రఘురామ మరో లేఖ.. తెలుగు భాషను భూస్థాపితం చేసే నిర్ణయాలపై రిఫరెండంకి వెళ్లాలని సూచన

ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోమారు లేఖ రాశారు. ఈసారి అమ్మ భాషను అదిమేసే చర్యలు, అసందర్భ నిర్ణయాలపై రఘురామకృష్ణంరాజు తన లేఖ ద్వారా విరుచుకుపడ్డారు. తెలుగు అకాడమీ లో సంస్కృతాన్ని చేర్చే ఏకపక్ష నిర్ణయం సరికాదని పేర్కొన్నఆయన, ఇక్కడ మీరు తెలుగు అకాడమీని పలుచన చేస్తూ ప్రజలకు ఏమి సందేశం ఇస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పిన రఘురామ

తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పిన రఘురామ


నవ సూచనలు విధేయతతో అంటూ రాసిన ఐదవ లేఖలో 2008 వ సంవత్సరం అక్టోబరు 31 వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులు అందరూ తెలుగును ప్రాచీన భాషగా గుర్తించడంతో సంతోషించారు అంటూ లేఖ మొదలుపెట్టిన రఘురామ ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, చత్తీస్ఘడ్, అండమాన్ నికోబార్ దీవులు సైతం తెలుగు భాషకు గుర్తింపునిచ్చాయి అని ఆయన తన లేఖ ద్వారా ప్రస్తావించారు. ఇదే సమయంలో అమెరికాలోనూ వేగంగా విస్తరిస్తున్న భాష తెలుగు భాష అని పేర్కొన్న ఆయన ఎందరో మహానుభావులు తెలుగు ఈ స్థాయికి తీర్చిదిద్దడానికి కృషి చేశారని లేఖ ద్వారా వెల్లడించారు.

 మహనీయుల కృషి తుడిచిపెట్టే ప్రయత్నం చెయ్యటం క్షంతవ్యం

మహనీయుల కృషి తుడిచిపెట్టే ప్రయత్నం చెయ్యటం క్షంతవ్యం

ఇక ఆయన తన లేఖలో తెలుగు భాష అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన తెలుగు అకాడమీ చరిత్రను, అది సాధించిన భాషాభివృద్ధి అని ప్రస్తావించారు. 1968 జూన్ 12వ తేదీన తెలుగు అకాడమీ ఏర్పాటైందని తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేసిన మహనీయులను మనం గుర్తించక పోయినా పర్వాలేదు కానీ వారు చేసిన కృషిని తుడిచిపెట్టడానికి ప్రయత్నించడం మాత్రం క్షమించరాని నేరమని రఘురామ కృష్ణంరాజు తన లేఖ ద్వారా స్పష్టం చేశారు. నాటి నుండి నేటి వరకు అనేక విధాలుగా భాషాభివృద్ధికి జరిగిన కృషిని తన లేఖ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియజేసే ప్రయత్నం చేశారు.

ప్రాథమిక విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలన్నప్పుడే మీ ఆలోచన స్పష్టం

ప్రాథమిక విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలన్నప్పుడే మీ ఆలోచన స్పష్టం

ఏ సమస్యనైనా ఒకే కోణం నుంచి మాత్రమే చూసే మీకు రెండో కోణం గురించి చెప్పేందుకు తాను ప్రయత్నం చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు రఘురామకృష్ణంరాజు. తెలుగు అకాడమీని పలుచన చేయడం ద్వారా మీరు తెలుగు ప్రజలకు ఏం సందేశ ఇవ్వనున్నారు ఎవరికీ అర్థం కావడం లేదని, ప్రాథమిక విద్యలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టాలని శతవిధాలా ప్రయత్నం చేసినప్పుడు మీరు తెలుగుభాషను తుడిచిపెట్టే ధరణి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఆ ఆందోళనకు కొనసాగింపుగా ఇప్పుడు తెలుగు అకాడమీలో సంస్కృతాన్ని ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని రఘురామకృష్ణంరాజు తన లేఖలో స్పష్టం చేశారు.

తెలుగును చంపెయ్యాలనే ఉద్దేశం తప్పు .. మీ దెబ్బకు నానా యాగీ చేసే యార్లగడ్డ సైతం సైలెంట్

తెలుగును చంపెయ్యాలనే ఉద్దేశం తప్పు .. మీ దెబ్బకు నానా యాగీ చేసే యార్లగడ్డ సైతం సైలెంట్

దేవ భాష అయిన సంస్కృతాన్ని ప్రోత్సహించటం ఎవరు తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ తెలుగును చంపెయ్యాలనే ఉద్దేశం మరింత తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని లేఖలో పేర్కొన్నారు. జగన్ వ్యవహారశైలిని చూసి ఎంతో మంది భయంతోనో విప్పడం లేదని తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గితే నానా యాగీ చేసే యార్లగడ్డ సైతం తెలుగు భాషలో జీవోలు ఇచ్చే సంప్రదాయాన్ని కూడా మానేసినా నోరుమెదపడం లేదని రఘురామకృష్ణంరాజు ఈ సందర్భంగా పేర్కొన్నారు.

తెలుగు భాషను భూస్థాపితం చేసే కార్యక్రమాల్లో భాగంగానా ఈ నిర్ణయం

తెలుగు భాషను భూస్థాపితం చేసే కార్యక్రమాల్లో భాగంగానా ఈ నిర్ణయం

ఎంత మంది వ్యతిరేకిస్తే అంత గొప్ప నిర్ణయం తీసుకున్నట్లు భావించడం మీకు పరిపాటిగా మారింది అని తనకు తెలుసు అని ఎద్దేవా చేశారు రఘురామ కృష్ణంరాజు. ఇలాంటి విచిత్రమైన ఆలోచన మీకు ఎలా వచ్చిందో తెలియడం లేదన్నారు. తెలుగు భాషను భూస్థాపితం చేసే కార్యక్రమాల్లో భాగంగానా అన్నట్టు సంస్కృతానికి పెద్ద పీట వేస్తున్నట్లు చెప్పడం తల్లికి అన్నం పెట్టనివాడు పిన్నమ్మకు పట్టు చీర కొని తెచ్చినట్టు అనే సామెతను ప్రజలకు గుర్తు చేస్తుంది అన్నారు.

 తెలుగును లేకుండా చెయ్యటం గోహత్య కంటే దారుణం

తెలుగును లేకుండా చెయ్యటం గోహత్య కంటే దారుణం

తెలుగు భాషను తెలుగు నేలపై లేకుండా చేయాలనే మీ ప్రయత్నాన్ని వివిధ పోస్టుల ద్వారా మీరు నామినేట్ చేసిన వారు హర్షించ వచ్చు కానీ యధార్థం వేరే విధంగా ఉంటుంది .తెలుగు భాషను తెలుగు సంస్కృతిని లేకుండా చేయడం అంటే గోహత్య కన్నా మహాపాతకం. పాలు తాగే పసిబిడ్డకి తల్లిని దూరం చేసినంత ఘోరం . తెలుగు భాషను పరిరక్షించండి.. ప్రోత్సహించకపోయినా పర్వాలేదు దాని మానాన దానిని బతకనివ్వండి అంటూ లేఖ రాశారు.

Recommended Video

    AP Cabinet Writes To krishna River Board On Srisailam Power Issue Targeting TS Genco|Oneindia Telugu
    ప్రజాభిప్రాయానికి వెళ్ళండి.. మెజార్టీ ప్రజలు అంగీకరిస్తే మీ ఇష్టం

    ప్రజాభిప్రాయానికి వెళ్ళండి.. మెజార్టీ ప్రజలు అంగీకరిస్తే మీ ఇష్టం

    తెలుగు భాష విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలపై ప్రజాభిప్రాయానికి వెళ్లి, మెజారిటీ ప్రజలు మీరు తీసుకున్న నిర్ణయంతో ఏకీభవిస్తే నిరభ్యంతరంగా మీరు అనుకున్నది చేసేయండి అంతే కానీ ఎవరి అభిప్రాయం తెలుసుకోకుండా భాషలపై ప్రయోగాలు చేసే ఏకపక్ష కార్యక్రమాలను ఇకనైనా మానుకోండి రఘురామ కృష్ణంరాజు తెలుగు భాషపై, తెలుగు అకాడమీ పేరు మార్పు పై జగన్ ను టార్గెట్ చేస్తూ సుదీర్ఘ లేఖ రాశారు. ఆ లేఖలో తెలుగు భాష గొప్పతనాన్ని, తెలుగు భాషాభివృద్ధికి మహనీయుడు చేసిన కృషిని, ప్రస్తుత రాష్ట్రంలో తెలుగు భాష పరిస్థితిని కళ్ళకు కట్టినట్లుగా పేర్కొన్నారు. జగన్ తన వైఖరి మార్చుకోవాలని భాషపై దాడి మంచిదికాదని తేల్చి చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+