Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ లక్ష లే్ఖల ప్లాన్- చివరి నిమిషంలో లీకుతో బ్రేక్ ? పట్టించుకోవద్దంటూ రఘురామ లెటర్

ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వార్ మరింత ముదురుతోంది. రఘురామరాజుపై అనర్హత వేటు కోసం ప్రయత్నిస్తుూన్న వైసీపీ ప్రయత్నాన్ని తప్పుబడుతూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఆయన రాసిన లేఖ కలకలం రేపుతోంది. ఇందులో ఆయన పేర్కొన్న అంశాలు సంచలనంగా మారాయి. దీంతో ఈ మొత్తం వ్యవహారానికే ఇదో మలుపుగా మారిపోతోంది. ఇంతకీ అసలు వైసీపీ చేస్తున్న ఫిర్యాదుల్లో ఏముంది, దీనిపై రఘురామరాజు ఎందుకు కలవరపడుతున్నారన్నది కూడా చర్చనీయాంశమవుతోంది.

రఘురామపై అనర్హత వేటు పడేనా ?

రఘురామపై అనర్హత వేటు పడేనా ?

వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వే.యించేందుకు వైసీపీ అధిష్టానం గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తోంది. అయితే అనర్హత వేటు మాత్రం పడటం లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. అయితే లోక్ సభ స్పీకర్ కు అనర్హత వేటుపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫళితం లేకపోవడంతో వైసీపీలో అసహనం కూడా పెరుగుతోంది. తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పీకర్ ఓం బిర్లాకు రాసిన లేఖను గమనిస్తే ఇదే అర్ధమవుతుంది. అయితే ఆ తర్వాత కూడా స్పీకర్ నుంచి ఎలాంటి స్పందనా లేదు.

రఘురామ అనర్హత కోసం వైసీపీ లక్ష లేఖలు

రఘురామ అనర్హత కోసం వైసీపీ లక్ష లేఖలు


గతంలో తమ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న రఘురామరాజుపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పలు లేఖలు రాసిన వైసీపీ ఫలితం లేకపోవడంతో రూటుమార్చినట్లు తెలుస్తోంది. తాజాగా రెబెల్ ఎంపీ రఘురామ రాజు స్పీకర్ కు రాసిన లేఖ చూస్తే ఈ విషయం అర్ధమవుతోంది. రఘురామరాజుపై వేటు కోసం స్పీకర్ ఓం బిర్లాకు వైసీపీ లక్ష లేఖలు రాయిస్టున్నట్లు ఆయన తాజాగా స్పీకర్ కు పంపిన లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ లక్ష లేఖల వ్యవహారం కలకలం రేపుతోంది.

వైసీపీ లక్ష లేఖలు పట్టించుకోవద్దన్న రఘురామ

వైసీపీ లక్ష లేఖలు పట్టించుకోవద్దన్న రఘురామ

తనపై అనర్హత వేటు కోరుతూ ఒకే రకంగా లక్ష లేఖలు ప్రింట్ చేసి వాటిపై వేర్వేరు వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు వేసి పంపుతున్నారని వైసీపీ నేతలపై రఘురామరాజు ఇవాళ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. వాటిని పట్టించుకోవద్దంటూ రఘురామ స్పీకర్ ఓంబిర్లాను కోరారు. ఇప్పటికే వైసీపీ నేతలతో సమానంగా రఘురామరాజు కూడా స్పీకర్ కు లేఖలు రాస్తున్నారు. వైసీపీ నేతలు అనర్హత వేటు వేయాలంటూ లేఖలు రాస్తుండగా.. వాటీని పట్టించుకోవద్దంటూ రఘురామ లేఖలు రాస్తుండటం విశేషం..

చివరి నిమిషంలో లేఖలకు బ్రేక్

చివరి నిమిషంలో లేఖలకు బ్రేక్

తనపై అనర్హత వేటు కోసం వైసీపీ నేతలు లక్ష లేఖలు ముద్రించారని, విషయం కాస్తా బయటకు పొక్కడంతో వాటిని పంపకుండా ప్లాన్ విరమించుకున్నారని రఘురామరాజు స్పీకర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో రఘురామరాజు లేవనెత్తిన ఈ లేఖల వ్యవహారం వైసీపీలో సైతం కలవరం రేపుతోంది. స్పీకర్ కు రాసిన లేఖలో వైసీపీ లేఖల ప్లాన్ విరమించుకున్న విషయాన్ని ప్రస్తావించిన రఘురామ.. తనపై వేటు వేయించేందుకు వైసీపీ నేతలు పలు కుట్రలకు పాల్పడుతున్నట్లు సంచలన ఆరోపణలు చేశారు. ఇలా వైసీపీ చేస్తున్న ప్రయత్నాలేవీ పట్టించుకోవద్దంటూ రఘురామ లేఖలో తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+