మోడీ అంటే జగన్‌కు భయం: రఘువీరా, ఎపి రాజధానిపై మందకృష్ణ డౌట్
విజయవాడ/ గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి భయపడే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బిజెపిని విమర్శించడం లేదని ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలో తమ పార్టీ నేత రాహూల్ గాంధీపై జగన్ చేసిన వ్యాఖ్యలను అవగాహన లేనివిగా ఆయన అభివర్ణించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం కాంగ్రెస్ పార్టీ తరపున మున్ముందు ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పారు. సీపీఎం నేత మధు అరెస్ట్‌ను ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. ఏపీ యూత్‌కాంగ్రెస్ ప్రెసిడెంట్‌గా దేవినేనిఅవినాష్‌ను నియమిస్తున్నట్లు రఘువీరా ప్రకటించారు.

రాజధాని నిర్మాణ ప్రక్రియ సరిగా జరగడం లేదని ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆయన బుధవారం గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రాంతంలో పర్యటించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు రూ.10 వేల పరిహారం ఇవ్వాలని, అసైన్డ్ భూములకూ పట్టా భూముల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని మందకృష్ణ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications