లోకేష్‌ను ఎమ్మెల్సీగా చేస్తే ఓకే: బాబుకు రఘువీరా
హైదరాబాద్: చిత్తూరు జిల్లా కుప్పం జన్మభూమి కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పాల్గొనడం రాజ్యాంగ విరుద్ధమని, ఆయనను ఎమ్మెల్సీగా చేసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేలా చేస్తే తమకు అభ్యంతరం లేదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రఘువీరా రెడ్డి మంగళవార అన్నారు.
నాలుగు నెలల్లోనే ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం మసకబారిందన్నారు. అందుకే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటి వాళ్లను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 12 లక్షల పింఛన్లు రద్దు చేసిన చంద్రబాబుకు జన్మభూమి జరిపే అర్హత లేదన్నారు.

చంద్రబాబు మంగళవారం ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పర్చూరు చేరుకున్నారు. మంత్రి శిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యేలు బాబు ఘన స్వాగతం పలికారు. పర్చూరులో నిర్వహించే జన్మభూమి - మాఊరు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు.
ట్రాక్టర్లతో పొలాల్ని దున్నిస్తున్న సిమెంటు కంపెనీ
గుంటూరు జిల్లా మాచవరం మండలం చెన్నాయపాలెంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సరస్వతి సిమెంట్ కంపెనీ భూముల్లో రైతులు సాగు చేసిన పంటలను యాజమాన్యం దున్నేస్తోంది. రెండువందల ట్రాక్టర్లతో పంటలను దున్నుతుండగా అడ్డుకునేందుకు రైతులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications