జగనన్న గోరుముద్దలో భాగంగా నేటినుండి ఏపీలో స్కూల్స్ విద్యార్థులకు రాగిజావ పంపిణీ!!
జగనన్న గోరుముద్దలో భాగంగా నేటినుండి ఏపీలో స్కూల్స్ విద్యార్థులకు రాగిజావ పంపిణీ చెయ్యనుంది ఏపీ ప్రభుత్వం. ఈ కార్యక్రమాన్ని నేడు సీఎం జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేయాలని ఏపీ సర్కార్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న సంస్కరణలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకొని ప్రతిరోజు విద్యార్థులకు రాగిజావ పంపిణీ చేసి వారికి పోషకాహారాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నేడు సీఎం జగన్ తాడేపల్లి లోనికి సీఎం క్యాంప్ కార్యాలయం నుండి వర్చువల్ గా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
చిన్నారుల పోషకాహార లోప నివారణకు జగనన్న గోరు ముద్ద పథకంలో భాగంగా ప్రతిరోజు స్కూల్ పిల్లలకు ఉదయం పూట రాగిజావ అందించనున్నారు. వారంలో మూడు రోజుల పాటు ఈ రాగిజావ అందించే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 44,397 ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో మొత్తం 37 లక్షల 63 వేల 698 మంది విద్యార్థులకు ఈ రాగిజావను అందించనున్నారు. ప్రతి సంవత్సరం 86 కోట్ల అదనపు వ్యయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఈ పథకం ద్వారా పోషకాహారాన్ని అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు రాగిజావ అందించడం ద్వారా వారిలో పోషకాహార లోపాన్ని నివారించవచ్చని, రక్తహీనతను నివారించవచ్చని భావిస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ విధానంలో ఈ పథకాన్ని నేడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. నేటి నుంచి ఈ పథకం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో అందుబాటులోకి రానుంది. వారంలో మూడు రోజులు ఇచ్చే రాగిజావని, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పల్లి చిక్కి ఇవ్వని రోజులైనా మంగళ, గురు, శనివారాల్లో ఇవ్వాలని నిర్ణయించారు
గత ప్రభుత్వం విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో పోషకాహారం అందించడానికి పెట్టిన ఖర్చు 450 కోట్ల రూపాయలు అయితే దానికి దాదాపు నాలుగు రెట్లు ఎక్కువగా జగనన్న గోరుముద్ద పథకం కింద ఏడాదికి 1824 కోట్లు ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఇక తాజాగా రాగి జావ కూడా జగనన్న గోరుముద్ద పథకంలో చేరడంతో మరో 86 కోట్లతో కలిపి మొత్తం జగనన్న గోరుముద్ద పథకం 1910 కోట్ల వ్యయానికి చేరుకుంది.












Click it and Unblock the Notifications