వైఎస్ జగన్, రాహుల్.. ఒకే మాట: భావోద్వేగపూరితం
India Pakistan War: అంచనాలకు తగ్గట్టే- పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులు చేపట్టింది. శతృదేశం ఊపిరి సలపనివ్వలేదు భారత్. ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. ఈ మిషన్‌కు భారత్ పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నా ఉగ్రవాదులు. ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచీ భారత్ వాదిస్తూ వచ్చింది. యుద్ధ సన్నాహకాలనూ చేపట్టింది.

తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది భారత్. తెల్లవారు జామున 2 గంటల సమయంలో చిక్కటి చీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి.
దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ భూభాగంపై ఉంటూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోన్న ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ వైమానిక దాడులను చేపట్టింది. ఉగ్రవాదాన్ని ఉద్దేశపూరకంగా పెంచి పోషిస్తూ వచ్చిన పాకిస్తాన్ పీచమణచాలనేదే ఈ దాడుల ముఖ్య ఉద్దేశం.
భారత్ చేపట్టిన ఈ మిస్సైళ్ల దాడి పట్ల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. సింగిల్ లైనర్ పోస్ట్ పెట్టారు. గర్వకారణమని అభివర్ణించారు. త్రివిధ దళాలను అభినందించారు. పాకిస్తాన్‌పై దాడులు చేపట్టడం ప్రశంసనీయమని ఆయన అభివర్ణించారు.
ఆర్మీ చేపట్టిన చర్యల పట్ల గర్విస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. జైహింద్.. అని ముగించారు. ఇదే అంశంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన స్పందనను తెలియజేశారు.
Proud of our Armed Forces. Jai Hind!
— Rahul Gandhi (@RahulGandhi) May 7, 2025
పహల్గామ్ ఉగ్రవాద దాడికి నిర్ణయాత్మక ప్రతిస్పందనగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. భారత రక్షణ బలగాలు ఆపరేషన్ సింధూర్‌ను ప్రారంభించడం గర్వకారణమని అన్నారు. ఉగ్రవాద దాడులు సాగిస్తోన్న సమయంలో ఇటువంటి సైనిక చర్యలు అనివార్యమని ఆయన పేర్కొన్నారు.
The Indian Defence Forces have launched #OperationSindoor in a decisive response to the heinous Pahalgam terror attack.
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 7, 2025
During such times,Such inevitable actions reflect the nation’s unwavering strength in safeguarding its sovereignty and protecting its citizens.All of us stand…
ఉగ్రవాదం పేట్రేగినప్పుడు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడం, పౌరులను సంరక్షించడంలో ఇలాంటి సైనిక చర్యలు దేశ అచంచలమైన శక్తిని ప్రతిబింబిస్తాయని వైఎస్ జగన్ భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. తాము అందరం కూడా అండగా నిలుస్తామని ఆయన కేంద్ర ప్రభుత్వానికి చెప్పారు. జై హింద్ అంటూ తన ట్వీట్‌ను ముగించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications