టికెట్ తీసుకోకుండానే రైలు ఎక్కేశారా?.. నో టెన్షన్
నిత్యం దేశవ్యాప్తంగా రైళ్లల్లో వేల సంఖ్యలో ప్రయాణిస్తుంటారు. ప్లాట్ ఫారంపై ప్రజలు ఎక్కువగా ఉండటం, టికెట్ కౌంటర్ దగ్గర కొండవీటి చాంతాడంత క్యూ లైను ఉండటంతో ఒక్కోసారి రైలు వెళ్లిపోతుంన్న టెన్షన్ లో టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కేస్తారు. టికెట్ లేకుండా ప్రయాణించడంవల్ల జరిమానా విధిస్తారు. అందుకే రైలు ఎక్కిన తర్వాత కూడా అన్ రిజర్వుడు టికెట్ ను బుక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
భారతీయ రైల్వే.. యూటీఎస్(అన్ రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్) అనే మొబైల్ యాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దాని సాయంతో ఎలా టికెట్లు తీసుకోవాలో చూద్దాం. మనం ప్రయాణించేటప్పుడే కాకుండా నెలవారీ సీజన్ టికెట్లు కూడా తీసుకోవచ్చు.
ఆండ్రాయిడ్ వాడేవారు గూగుల్ ప్లేస్టోర్, ఐఫోన్ వాడేవారు యాప్ స్టోర్, విండోస్ ఫోన్‌లు వాడేవారు విండోస్ యాప్ స్టోర్ నుంచి యూటీఎస్(UTS) అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మన ఫోన్ నెంబరుతోపాటు పేరు, పాస్ వర్డ్, పుట్టిన తేదీతోపాటు ఇతర వివరాలను నమోదు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓటీపీ వస్తుంది.. దాన్ని నమోదు చేస్తే చాలు.

* రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఫోన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో మన అకౌంట్‌లోకి లాగిన్ అవ్వాలి.
* టికెట్ బుకింగ్ కోసం 'నార్మల్ బుకింగ్' ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆన్‌లైన్ టికెట్ కావాలనుకుంటే బుక్ అండ్ ట్రావెల్ (పేపర్‌లెస్), ప్రింటెడ్ టికెట్ కావాలనుకుంటే బుక్ అండ్ ప్రింట్(పేపర్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
* మనం ఎక్కడికి ప్రయాణించాలో ఆయా స్టేషన్ల వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రయాణికుల సంఖ్య, ఎక్స్ ప్రెస్ ట్రైనా? సూపర్ ఫాస్టా? రెండోక్లాసా? అన్ రిజర్వుడ్ లాంటి వివరాలు నమోదు చేయాలి.
* 'పేమెంట్ టైప్'లో ఆర్-వ్యాలెట్ లేదంటే ఆన్ లైన్ లో నగదు కట్టేందుకు ఉన్న ఆప్షన్లను ఎంపిక చేసుకోవచ్చు. టికెట్ ఖర్చు ఎంతవుతుందో అంత 'బుక్ టికెట్'పై క్లిక్ చేయాలి. దీంతో టికెట్ బుక్ అవుతుంది.
*'షో టికెట్' ఆప్షన్‌పై క్లిక్ చేస్తే టికెట్ వివరాలు కనిపిస్తాయి. 'వ్యూ టికెట్'పై క్లిక్ చేస్తే.. మనం బుక్ చేసుకున్న టికెట్ కనిపిస్తుంది.
*'ప్లాట్‌ఫాం బుకింగ్' ద్వారా ప్లాట్‌ఫాం టికెట్, 'సీజనల్ టికెట్స్'తో నెలవారీ టికెట్ తీసుకోవచ్చు. వాటిని రెన్యువల్ కూడా చేసుకోవచ్చు.
* ఆర్ వ్యాలెట్ ను ఉపయోగించాలనుకుంటే ముందుగా దాన్ని రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది. రూ.100 లోపు రీఛార్జ్ సాధ్యపడదు. రూ.100, ఆపై మాత్రమే రీఛార్జ్ చేసుకోవచ్చు.
జీపీఎస్‌ను యాక్టివేట్ చేయడంతోపాటు మనం ప్రయాణించే రోజు మాత్రమే టికెట్ తీసుకోగలం. టికెట్ పొందిన గంటలోపు రైలెక్కాలి.
* ఎంపిక చేసిన స్టేషన్‌లలో మాత్రమే ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోగలం.
* పేపర్‌లెస్ టికెట్ రద్దు చేయడం కుదరదు. రైలు ఎక్కాల్సిన స్టేషన్ కు దగ్గర్లో ఉండి వీటిని పొందాల్సి ఉంటుంది. గతంలో నాన్ అర్బన్ ప్రాంతాల పరిధి 5 కిలోమీటర్ల వరకు ఉండగా దాన్ని 20 కిలోమీటర్లకు పెంచారు. అలాగే అర్బన్ పరిధిలో 2 కిలోమీటర్లుగా ఉన్న పరిధిని 5 కిలోమీటర్లకు పెంచారు












Click it and Unblock the Notifications