తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన నగరాలకు మూడు వందేభారత్ రైళ్లు..!!
తెలుగు రాష్ట్రాల నుంచి ప్రధాన నగరాలకు మూడు వందేభారత్ రైళ్లను కేటాయిస్తే రైల్వే బోర్డు నిర్ణయించింది.
రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైళ్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తోంది. తెలుగు రాష్ట్రాలకు మరో మూడు వందేభారత్ రైళ్లు మంజూరయ్యాయి. వచ్చేది ఎన్నికల సీజన్ కావటంతో దక్షిణాది రాష్ట్రాలకు వందేభారత్ కేటాయింపుకు ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేస్తోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల నడుమ సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రారంభించిన వందేభారత్ కు అనూహ్య స్పందన వస్తోంది. ధరలు ఎక్కువగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అయినా వంద శాతం ఆక్యుపెన్సీతో వందేభారత్ నడుస్తోంది. వచ్చేది వేసవి కావటంతో ఇదే రద్దీ కొనసాగుతోందని అంచనా వేస్తున్నారు. దీంతో..ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటుగా.. ఇక్కడ నుంచి డిమాండ్ ఉన్న ప్రముఖ నగరాలకు వందేభారత్ రైళ్లను నడింపేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది.

తెలుగు రాష్ట్రాలు - నగరాలకు మూడు వందేభారత్ రైళ్లు
తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా మూడు వందేభారత్ రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ అంగీకారం తెలిపింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన స్టేషన్ సికింద్రాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా డిమాండ్ ఉన్న లైన్ల పైన రైల్వే శాఖ వివరాలు కోరింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడకు ఎక్కడ వందేభారత్ ఉపయోగపడుతుందనే కోణంలో లైన్లు..రద్దీ వివరాల గురించి ఆరా తీసింది. నిత్యం సికింద్రాబాద్ నుంచి తిరుపతి, సికింద్రాబాద్ టు బెంగళూరు, అదే విధంగా సికింద్రాబాద్ నుంచి పూణే నగరాలకు ఎక్కువ రద్దీ..ఉన్న రైళ్లలో వెయిటింగ్ లిస్టు గురించి అధికారులు నివేదించారు. దీంతో..ఇతర రైళ్లల్లో ఏసీ కోచ్ ల్లో ఈ నగరాలకు వెళ్లే వారి రోజువారీ రద్దీని పరిగణలోకి తీసుకున్నారు. ఆ తరువాత కాచిగాడ - బెంగళూరు, సికింద్రాబాద్ - తిరుపతి, సికింద్రాబాద్ నుంచి పూణే మధ్య కొత్తగా వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి.
తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు మేలు చేసేలా
ఇప్పటికే సికింద్రాబాద్ -విశాఖ మధ్య వందేభారత్ కు తొలుత ఖాళీలు కనిపించినా..ఇప్పుడు వంద శాతం ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటకలోనూ ఏడాది కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో వందేభారత్ రైళ్ల కేటాయింపులో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి కేటాయించే వందేభారత్ ను నారాయణాద్రి రూట్ లో నిర్వహించే అంశం పరిశీలిస్తున్నారు. లైన్ సమర్ధత పెంచాల్సిన అవసరం ఉందని గుర్తించారు. అదే విధంగా కాచిగూడ నుంచి బెంగళూరు రూటులో కూడా వందేభారత్ తీసుకురావటం ద్వారా ప్రయోజనకరం గా ఉంటుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ లైన్ లో రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సమయంలో బెంగుళూరు ఐటీ పరిశ్రమలో తెలుగు వారి సంఖ్య ఎక్కువ. తెలుగు రాష్ట్రాల నుంచి బెంగళూరు కు వందేభారత్ నడపటం ద్వారా పలువురికి ప్రయోజనకంగా ఉంటుందని భావించి..ఈ రెండు లైన్లలో కొత్తగా నిర్ణయం తీసుకున్నారు.













Click it and Unblock the Notifications