ఏపీ మీదుగా ఒడిశా-తమిళనాడు స్పెషల్ రైళ్లు..! ఈ స్టేషన్లలో హాల్ట్ లు..!

దక్షిణాదిలో పండుగల వేళ రైళ్లలో రద్దీ పెరుగుతోంది. దీంతో వివిధ రైల్వే జోన్ లు వీటిని తట్టుకునేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక రైళ్లను (Special Trains) ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పు కోస్తా రైల్వే ఒడిశా నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వీటి వివరాలను ఇవాళ ప్రకటించింది. ఆగస్టు నుంచి ప్రారంభమై నవంబర్ వరకూ ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించబోతున్నాయి. వీటికి ఏపీలో హాల్ట్ లు ఉండటంతో ఇక్కడి ప్రయాణికులకు కూడా సౌకర్యంగా ఉంటుంది.

Visakhapatnam–LTT Express: విశాఖ-లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు కొత్త స్టాప్..!
Visakhapatnam–LTT Express: విశాఖ-లోక్ మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ కు కొత్త స్టాప్..!

పూజా పండుగ నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే సంబల్‌పూర్-పొదనూర్ (Sambalpur and Podanur) మధ్య 24 ప్రత్యేక రైలు సర్వీసులు ప్రకటించింది. ఒడిశా లోని సంబర్ పూర్ నుంచి ఏపీ మీదుగా తమిళనాడులోని పొదనూర్ కు ఇవి రాకపోకలు సాగిస్తాయి. ఇందులో రైలు నంబర్ 08311 సంబల్‌పూర్-పొదనూర్ ఎక్స్‌ప్రెస్ ప్రతీ బుధవారం సంబల్‌పూర్ నుంచి ఉదయం 11.35 గంటలకు బయలుదేరుతుంది. ఈ సర్వీసులు సెప్టెంబర్ 9 నుంచి నవంబర్ 25 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు మూడో రోజు తెల్లవారుజామున 1.30 గంటలకు పొదనూర్ చేరుకుంటుంది. ఇలా మొత్తం 12 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

Railways Announces Special Trains Between Sambalpur and Podanur to Clear Puja Festival Rush
విశాఖ-విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్- రేపట్నుంచి 3 రోజులు ..!
విశాఖ-విజయవాడ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్- రేపట్నుంచి 3 రోజులు ..!

అలాగే మరో రైలు నంబర్ 08312 పొదనూర్-సంబల్‌పూర్ ఎక్స్‌ప్రెస్ స్పెషల్ ప్రతి శుక్రవారం పొదనూర్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరుతుంది. ఈ రైలు సెప్టెంబర్ 11 నుంచి నవంబర్ 27 వరకు నడుస్తుంది. ఇది మరుసటి రోజు రాత్రి 11.15 గంటలకు సంబల్‌పూర్ చేరుకుంటుంది. ఈ దిశలో కూడా మొత్తం 12 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లలో మొత్తం 20 కోచ్‌లు ఉంటాయి. వీటిలో ఒక ఏసీ ఫస్ట్ క్లాస్ కోచ్, ఒక ఏసీ టూ టైర్ కోచ్, 5 ఏసీ త్రీ టైర్ కోచ్‌లు, 7 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 4 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 1 దివ్యాంగుల సెకండ్ క్లాస్ కోచ్, 1 లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్ ఉంటాయి. ఈ ప్రత్యేక రైళ్లకు అడ్వాన్స్ రిజర్వేషన్ ఆగస్టు 29న ఉదయం 8 గంటలకు దక్షిణ రైల్వే పరిధిలో ప్రారంభమవుతుంది. ఈ ప్రత్యేక రైళ్లకు ఏపీలో పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్త వలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరులో స్టాప్ లు ఉన్నాయి.

Godavari Station: గోదావరి స్టేషన్లో ఈ రైళ్లకు స్టాప్ తొలగింపు..!
Godavari Station: గోదావరి స్టేషన్లో ఈ రైళ్లకు స్టాప్ తొలగింపు..!
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+