భక్తులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్.. శబరిమలకు శ్రీకాకుళం నుంచి స్పెషల్ ట్రైన్స్..
అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ ఓ శుభవార్తను అందించింది. శబరిమలకు వెళ్లే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈస్ట్‌కోస్ట్ రైల్వే శ్రీకాకులం నుంచి ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయ్యప్ప భక్తుల అదనపు రద్దీని తగ్గించేందుకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం టు కొల్లాం మధ్య స్పెషల్ ట్రైన్స్‌ను నడపాలని నిర్ణయించింది. అలాగే విశాఖపట్నం-కొల్లాం స్పెషల్ సర్వీసులను పొడిగించాలని నిర్ణయించింది.
ప్రత్యేక రైళ్ల జాబితా ఇదే..
08553 అనే నెంబర్ గల శ్రీకాకుళం రోడ్‌లో బయలుదేరే శ్రీకాకుళం రోడ్ టు కొల్లాం ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ ట్రైన్ 2024 డిసెంబర్ 1 నుండి 2025 జనవరి 26వ తేది వరకు ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ స్పెషల్ ట్రైన్ ఆదివారాల్లో ఉదయం 6.00 గంటలకు శ్రీకాకుళం రోడ్డు నుంచి బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు కొల్లాం రైల్వేస్టేషన్ చేరుకుంటుంది. 08554 అనే నెంబర్‌గల కొల్లాం టు శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ 2024 డిసెంబర్ 2వ తేది నుండి 2025 జనవరి 27వ తేది వరకు అందుబాటులోఉంటుంది. ఈ స్పెషల్ ట్రైన్ ప్రతి సోమవారాల్లో సాయంత్రం 4.30 గంటలకు కొల్లాం స్టేషం నుండి ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ బుధవారం అర్థరాత్రి 2.30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది.

ఈ స్టేషన్లలో ఆగుతాయి..
శ్రీకాకుళం టు కొల్లాం మధ్య నడిచే ఈ రెండు స్పెషల్ ట్రైన్స్ పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, ఈరోడ్, జోలార్‌పేట, పోదనూరు, పాలక్కాడ్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, ఎట్టుమనూర్, కొట్టాయం, చెంగనస్సేరి, తిరువాల, చెంగన్నూర్, మావేలికర, కాయంకులం రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్స్‌లో 4 సెకండ్ క్లాస్, 8 స్లీపర్ క్లాస్, 6 థర్డ్ ఏసీ ఎకానమీ, 1 సెకండ్ ఏసీ కోచ్, 1 సెకండ్ క్లాస్ సిట్టింగ్ కమ్ లగేజీ/ దివ్యాంగజన్, ఒక లగేజీ/జనరేటర్/బ్రేక్ వాన్ కోచ్‌లు ఉంటాయి.












Click it and Unblock the Notifications