లోకేష్ కు కేంద్రం బిగ్ న్యూస్..! 112 కోట్ల ప్రాజెక్టుకు ఓకే ..!

ఏపీలో ఐటీ మంత్రి నారా లోకేష్ కు ఇవాళ కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. ఈ మధ్య వరుసగా కేంద్రంలోని పెద్దల్ని ఢిల్లీ వెళ్లి కలుస్తున్న ప్రభావమో లేక రాష్ట్రంలో ఆయనకు పెరుగుతున్న ఆదరణో తెలియదు కానీ లోకేష్ నియోజకవర్గం మంగళగిరికి చెందిన ఓ కీలక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఇవాళ రైల్వేశాఖ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

మంగళగిరి, కృష్ణ కెనాల్ స్టేషన్ల మధ్య E13ఎక్స్‌టెన్షన్ రోడ్డు వద్ద రూ.112 కోట్ల అంచనా వ్యయంతో 6 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ ప్రతిపాదనను రైల్వే మంత్రిత్వ శాఖ ఇవాళ ఆమోదించింది. ప్రతిపాదిత ఆర్.ఓ.బి అమరావతి రాజధాని, జాతీయ రహదారి-16 ను అనుసంధానించబోతోంది. ఈ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా రైల్వే శాఖ భరించనుందని అధికారులు తెలిపారు.

Railways Greenlights 6-Lane Bridge Connecting Mangalagiri and Krishna Canal stations in amaravati

E13 స్థానం కీలకమైన ప్రదేశంలో ఉండి ఎన్.ఎచ్-16 ను అమరావతి రాజధానితో కలుపుతుందని రైల్వే వర్గాలు తెలిపాయి. అలాగే మధ్యలో ఒక వైపు రైల్వే ట్రాక్ ఉందని వెల్లడించాయి. ఈ రైల్వే ట్రాక్ చెన్నై-హౌరాను విజయవాడ మీదుగా కలిపే ముఖ్యమైన రద్దీ రైల్వే లైన్ ఉంది. ప్రారంభంలో దీనిని నాలుగు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి కోసం ప్రణాళిక చేశారు. కానీ అమరావతి భవిష్యత్తు ట్రాఫిక్ ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకుని 6లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదించింది.

Railways Greenlights 6-Lane Bridge Connecting Mangalagiri and Krishna Canal stations in amaravati

ఈ ప్రాజెక్టు టెండరింగ్ ప్రక్రియకు వెళ్లే ముందు డిజైన్ల ఆమోదం, సాధారణ డ్రాయింగ్‌లు వంటి ప్రాథమిక పనులు త్వరలో పూర్తవుతాయని రైల్వే తెలిపింది. ప్రతిపాదిత రోడ్డు ఓవర్ బ్రిడ్జి ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర ప్రాంతం వైపు వెళ్లే రోడ్డు ట్రాఫిక్ సజావుగా సాగడానికి ఎంతో సహాయపడుతుందని వెల్లడించింది. ఇది రోడ్డు , రైలు వినియోగదారుల భద్రతతో పాటు ట్రాఫిక్ ను తగ్గించడానికి పనికొస్తుందని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+