ఏపీలో భారీ వర్షాలు: పిడుగుపాటుకు నలుగురి మృతి
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శుక్రవారం నాడు మధ్యాహ్నం ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం నుండి తూర్పు గోదావరి జిల్లా వరకు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా చాలాచోట్ల వృక్షాలు నేలకొరిగాయి. వీధులు, నగరాలు జలమయమయ్యాయి.
రాజమండ్రిలో భారీగా ఈదురు గాలులతో వర్షాలు కురుస్తున్నాయి. కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. విశాఖపట్నంలో పిడుగుపాటుకు నలుగురు రైతులు మృతి చెందారు. చనిపోయిన వారు విశాఖపట్నం జిల్లాలోని కే కోటపాడు మండలానికి చెందిన వారు.

రెండు రోజుల క్రితం తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ఈ వర్షాలతో భారీ నష్టం జరిగింది. పంట మొత్తం నీట మునగడంతో రైతులు నష్టపోయారు. వీటిని రాజకీయ నాయకులు పరిశీలిస్తున్నారు. అప్పుడే మళ్లీ ఏపీని వర్షాలు ముంచెత్తాయి.












Click it and Unblock the Notifications