జగన్ ఓటమిపై రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 164 ఎమ్మెల్యే సీట్లును కైవసం చేసుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల్లో 151 స్థానాలను కైవవం చేసుకున్న వైసీపీ ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అధికార వైసీపీ కేవలం 11 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. వైసీపీ కీలక నేతలు, మంత్రులు ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవడం జరిగింది. 11 సీట్లలో మాత్రమే విజయం సాధించి ప్రతిపక్ష హోదా కూడా సాధించలేకపోయింది.
నాలుగు పార్లమెంట్ స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలైయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలుకావడం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.తెలంగాణ బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు సైతం తిరిగి జగన్ విజయం సాధిస్తారని చెప్పడం జరిగింది. అయితే ఎవరూ ఊహించని రీతిలో జగన్ దారుణంగా ఓడిపోయారు. తాజాగా జగన్ ఓటమిపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.జగన్ ఓటమి గురించి ఆయన శనివారం తన అధికారిక ఎక్స్‌లో ఓ వీడియోను విడుదల చేశారు.

ఏపీలో వైసీపీ ఓటమిని ఉద్దేశించి మాట్లాడుతూ.. కన్వర్ట్‌డ్ క్రిస్టియన్ జగన్ అధికారంలోకి రాగానే హిందూ ధర్మానికి తీవ్ర నష్టం చేశారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి రాగానే ప్రాచీన దేవాలయాలపై దాడులు చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తిరుమలలో అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం, కన్వర్ట్‌డ్ క్రిస్టియన్‌ను టీటీడీ చైర్మన్‌గా నియమించడం జగన్ చేసిన మొదటి తప్పుగా ఆయన అభివర్ణించారు.
జగన్ హయాంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశారని.. మాంసం, మందు కూడా కొండపైకి తరలించారని రాజాసింగ్ జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవ్వని గమనించిన ఏపీ ప్రజలు జగన్ పాలనలో ఆంధ్ర సురక్షితంగా ఉండదని భావించి ఆయన్ను ఓడించారని రాజాసింగ్ తెలిపారు. ఏపీలో ఉన్న ప్రాచీన దేవాలయాల్లో హిందూ ధర్మాన్నే ప్రచారం చేసేలా చూడాలన్నారు. హిందువులకు మాత్రమే ఆలయాల్లో ఉద్యోగాలు, చైర్మన్, బోర్డు మెంబర్లు ఇవ్వాలని ఈ సందర్భంగా రాజాసింగ్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications