ఇది క్లియర్: శిల్పాకు రాజగోపాల్ ట్విస్ట్.. జగన్ తనకే 'టికెట్' ఇస్తారన్న ధీమా!

Subscribe to Oneindia Telugu

నంద్యాల: మాజీ మంత్రి, టీడీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్న తరుణంలో.. నంద్యాల రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. నిన్నటిదాకా టీడీపీలో సొంతగూటి పంచాయితీని తలపించిన ఈ వ్యవహారం.. ఇప్పుడు వైసీపీలోను నిప్పు రాజేస్తుందా? అన్న సందేహాలను రేకెత్తిస్తోంది.

తమ్ముడితో రాజకీయ విబేధాలు, కానీ, రాజగోపాల్ రెడ్డితో లేవంటూ శిల్పా సంచలనం

తాజాగా నంద్యాల నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జీ.. రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి.ఓవైపు పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని చెబుతూనే.. మరోవైపు ఉపఎన్నికలో టికెట్ తనదేనంటూ మోహన్ రెడ్డి ప్రచారం చేసుకోవడాన్ని ఆయన తప్పుపట్టారు.

rajagopal reddy twist to shilpa mohanreddy over nandyala by poll

టికెట్ గురించి జగన్ ఆయనకేమైనా చెప్పారా? అని ప్రశ్నించారు. అంతేకాదు, నంద్యాల టికెట్ తనకేనని జగన్ తొలి నుంచి చెబుతున్నారని గుర్తుచేశారు. ఇదే విషయాన్ని జగన్ వద్ద కూడా మళ్లీ ప్రస్తావిస్తామన్నారు. వైఎస్ కుటుంబంతో తనకు 30ఏళ్ల అనుబంధం ఉందని, జగన్ తనకు అన్యాయం చేయరని ధీమా వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ నిర్ణయం తనకు ప్రతికూలంగా ఉన్నా.. టికెట్ రాకపోయినా.. అప్పుడు ఆలోచిద్దామన్నారు.

మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే.. శిల్పామోహన్ రెడ్డికి నంద్యాల టికెట్ దక్కడం అనుమానమే అన్న అభిప్రాయం కలగకమానదు. ఈ లెక్కన జగన్ నుంచి ఎలాంటి భరోసా లభించుకుండానే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దపడ్డారని తెలుస్తోంది.

అఖిలప్రియ పావులు: అందుకే బాబుకు శిల్పా షాక్, జగన్ లెక్క ఇదీ

ఉపఎన్నిక విషయంలో శిల్పామోహన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అభిప్రాయాలు ఎలా ఉన్నా.. జగన్ మదిలో ఏముందనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ఈ ఇద్దరిని సమన్వయపరిచేలా ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై వైసీపీ నంద్యాల రాజకీయం ఆధారపడి ఉంది. అలా కాకుండా.. ఇద్దరిలో ఎవరు నొచ్చుకున్నా..వైసీపీ రాజకీయం మరో మలుపు తిరగడం ఖాయం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Nandyala YSRCP incharge Rajagopal Reddy questioned Shilpa Mohanreddy over Nandyala by-poll ticket. He said Jagan did't give any promise to Shilpa about Nandyala ticket
Please Wait while comments are loading...